ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi : సంక్షేమమే తారకమంత్రం

ABN, Publish Date - Nov 17 , 2024 | 04:43 AM

ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరం.. సంక్షేమమే తారకమంత్రం...ఇదే పరమార్థంగా తన ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

  • ఇదే పరమార్థంగా పాలిస్తున్నాం.. అందుకే కేంద్రంలో మాకు మూడోసారీ చాన్స్‌

  • నాడు ఉగ్రవాదం భయపెట్టేది

  • నేడు సొంతగడ్డపైనే అది భయపడుతోంది

  • హిందూస్థాన్‌ టైమ్స్‌ సదస్సులో మోదీ

న్యూఢిల్లీ, నవంబరు 16: ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరం.. సంక్షేమమే తారకమంత్రం...ఇదే పరమార్థంగా తన ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అనే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు దీనికి పూర్తి వ్యతిరేకంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం వల్ల దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నదని విమర్శించారు. ఉగ్రవాదులు తమ సొంతగడ్డ పైనే భయంభయంగా బతికే పరిస్థితులను కల్పించామని మోదీ వ్యాఖ్యానించారు. 100 ఏళ్లు పూర్తిచేసుకున్న ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ నిర్వహించిన లీడర్‌షిప్‌ సదస్సులో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విపక్షాలను దుయ్యబట్టారు. ఎన్నికలు జరిగిన ప్రతి దేశంలో ప్రభుత్వాలు మారుతున్నాయని, భారత్‌లో మాత్రం మూడోసారి కూడా ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని చెప్పారు. తమ ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఇదే నిదర్శనమన్నారు. దుష్ప్రచారాలను, తప్పుడు సమాచారాన్ని వెదజల్లేందుకు ఎక్కువ అవకాశం ఉన్న సోషల్‌ మీడియా యుగంలోనూ ఎన్డీయే కూటమి, ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం కలిగి ఉన్నతీరును అంతా అర్థం చేసుకోవాలన్నారు.

‘‘గతంలో ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వానికి తిరిగి వచ్చే ఎన్నికలపైనే ధ్యాస ఉండేది. దీనికోసం ఓటుబ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశపెట్టేవి. కాంగ్రెస్‌ పాలన అంతా ఇలాగే గడిచింది’’ అని మోదీ ఆక్షేపించారు. అభివృద్ధిలో భారత్‌ను పరుగులు పెట్టించే దిశగా న్యూ ఇండియాను నిర్మించడమే పరామర్థంగా తన ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాగా, పాత పత్రికలు తిరగేస్తుంటే ఉద్వేగం కలుగుతూ ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.


1947 అక్టోబరులో భారత్‌లో కశ్మీర్‌ విలీనమైన వార్త ఉన్న పత్రికను చదివిన అప్పటి పాఠకులు ఎలాంటి ఉద్విగ్నతకు లోనయ్యారో, ఇప్పటికీ తాను కూడా అదే అనుభూతికి గురవుతుంటానని చెప్పారు. కాగా, విదేశీ పర్యటన నిమిత్తం మోదీ శనివారం బయలుదేరి వెళ్లారు. ఆయన అయిదు రోజుల పాటు నైజీరియా, బ్రెజిల్‌, గుయానా దేశాల్లో పర్యటించనున్నారు. నైజీరియా ప్రధాని బోలా అహ్మద్‌ టినుబు ఆహ్వానం మేరకు వెళ్తున్న మోదీ ఆ దేశంలో రెండు రోజుల పాటు గడపనున్నారు. మోదీ అక్కడ నుంచి బ్రెజిల్‌ వెళ్లి ఈనెల 18న జీ-20 19వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. చివరగా ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు గుయానాలో పర్యటిస్తారు.

Updated Date - Nov 17 , 2024 | 04:43 AM