ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

International Yoga Day: శ్రీనగర్‌లో 7 వేల మందితో ప్రధాని మోదీ యోగా..

ABN, Publish Date - Jun 19 , 2024 | 07:57 PM

జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌‌లోని దాల్ సరస్సు సమీపంలోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు.

శ్రీనగర్‌, జూన్ 19: జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌‌లోని దాల్ సరస్సు సమీపంలోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 7 వేల మందితో కలిసి ప్రధాని మోదీ యోగా చేయనున్నారు. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటి.. ఈ ఏడాది యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యంగా నిర్ణయించారు.


జమ్ము కాశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా జూన్ 20వ తేదీ గురువారం సాయంత్రం ప్రధాని మోదీ శ్రీనగర్ చేరుకుంటారు. అనంతరం శ్రీనగర్‌లో.. ఎంపవరింగ్ యూత్ అండ్ ట్రాన్స్‌ఫార్మింగ్ జమ్ము అండ్ కాశ్మీర్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. అందులోభాగంగా స్థానిక యువతను ఆయన కలవనున్నారు.

అలాగే రూ. 15 వందల కోట్ల విలువైన 84 మేజర్ ప్రాజెక్ట్‌లకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరనున్న 2 వేల మందికి మోదీ నియామక ప్రతాలు అందజేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత చర్యలను జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 07:58 PM

Advertising
Advertising