ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sabarmati Report: పార్లమెంటులో 'సబర్మతి రిపోర్ట్'ను వీక్షించనున్న మోదీ

ABN, Publish Date - Dec 02 , 2024 | 04:00 PM

గోద్రా ఘటన వెనుక నిజాలు, 2002లో ఏమి జరిగింది, మీడియా పాత్ర ఏమిటి అనే ఘటనల చుట్టూ రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టడంతో 59 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

న్యూఢిల్లీ: విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించిన 'ది సబర్మతి రిపోర్ట్' (The Sabarmati Report) చిత్రాన్ని పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendr Modi) సోమవారంనాడు వీక్షించనున్నారు. లోక్‌‌సభ స్పీకర్, మంత్రులు, ఎంపీలు సైతం ఆయనతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షిస్తారు. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ చుట్టూ కథ నడుస్తుంది. న్యాయవ్యవస్థ, సమాజం, ఒక జర్నలిస్టు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇందులో దర్శకుడు ధీరజ్ సర్నా ఆవిష్కరించారు. రాశీఖన్నా, రిధి డోగ్రా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 15న దేశవ్యాప్తంగా విడుదలైంది.

Shrikant Shinde: ఉప ముఖ్యమంత్రి పదవిపై షిండే తనయుడు క్లారిటీ


గోద్రా ఘటన వెనుక నిజాలు, 2002లో ఏమి జరిగింది, మీడియా పాత్ర ఏమిటి అనే ఘటనల చుట్టూ రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టడంతో 59 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.


మోదీ ప్రశంసలు

'ది సబర్మతి ఎక్స్‌ప్రెస్'పై ఒక సమీక్షకుడు మోదీని ట్యాగ్ చేస్తూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో మోదీ సైతం స్పందించారు. కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని, సామాన్యులకు కూడా అర్ధమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రశంసించారు.


ఇది కూడా చదవండి

Farmers Protest Impact: రైతుల నిరసన ఎఫెక్ట్.. ఎక్స్‌ప్రెస్‌వేపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

Cyclone Fengal Impact: ఫెంగల్ తుపాను కారణంగా 19 మంది మృతి.. ఎక్కడెక్కడంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 02 , 2024 | 04:00 PM