ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi: పొంగల్ వేడుకల్లో పాల్గొని చిన్నారికి గిఫ్ట్ ఇచ్చిన మోదీ!

ABN, Publish Date - Jan 14 , 2024 | 03:51 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని మంత్రి మురుగన్ అధికారిక నివాసంలో పొంగల్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఈ వేడుకలో భాగంగా ఓ చిన్నారి పాటను ఆలపించగా అది విన్న ప్రధాని చిన్నారికి బహుమానం అందించారు.

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి (MoS) ఎల్ మురుగన్ నివాసంలో నిర్వహించిన పొంగల్(pongal) వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక యువ గాయని పాట పాడుతూ ప్రదర్శన ఇచ్చింది. ఆ తరువాత ప్రధాని మోదీ వద్దకు వచ్చి తన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది. ఆ క్రమంలోనే తన పాటతో పరవశించి పోయిన ప్రధాని మోదీ ఆ చిన్నారిని ఆశీర్వదించి త‌న శాలువ‌(shawl)ను బహూకరించారు. ఆ క్రమంలో చిన్నారికి సన్మానం చేసి అందించారు. దీంతో చిన్నారి సంతోషంతో ధన్యావాదాలు తెలిపింది. అయితే ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.


ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ధోతీలో రావడం విశేషం. ఆ క్రమంలో గోవుకు పూజలు చేశారు. ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఒకే భారతదేశం, ఉత్తమ భారతదేశం అనే స్ఫూర్తిని పొంగల్ పండుగ ప్రతిబింబిస్తుందని మోదీ అన్నారు. ఈ ఐక్యతా స్ఫూర్తి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశానికి' బలాన్ని ఇస్తుందని ప్రధాని అన్నారు. అలాగే పండుగలన్నీ ఏదో ఒక రకంగా వ్యవసాయానికి(agriculture) సంబంధించినవేనన్నారు. 3 కోట్ల మంది రైతులు శ్రీఆన్‌తో అనుబంధం కలిగి ఉన్నారని, దేశంలోని చాలా మంది యువత శ్రీఆన్‌తో స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారని ప్రధాని అన్నారు. మిల్లెట్లు తమిళ సంస్కృతితో ముడిపడి ఉన్నాయని గుర్తు చేశారు.

Updated Date - Jan 14 , 2024 | 03:51 PM

Advertising
Advertising