ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: తమిళనాట మోదీ పర్యటన వేళ.. బీజేపీ పుంజుకుంటుందా

ABN, Publish Date - Feb 27 , 2024 | 11:26 AM

వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ప్రధాని మోదీ(PM Modi) బుధవారం తమిళనాడు(Tamilnadu)లో పర్యటిస్తున్నారు. ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమమే అయినా.. దానికి రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు.

చెన్నై: వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ప్రధాని మోదీ(PM Modi) బుధవారం తమిళనాడు(Tamilnadu)లో పర్యటిస్తున్నారు. ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమమే అయినా.. దానికి రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. తమిళనాట బీజేపీకి కేవలం 3 శాతం ఓటింగ్ మాత్రమే ఉంది. ఈ క్రమంలో మోదీ పర్యటన బీజేపీకి అదృష్టాన్ని తీసుకొస్తుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

బీజేపీ మిత్ర పక్షం ఏఐఏడీఎంకేతో తెగదెంపులు చేసుకున్న తరువాత రాష్ట్రంలో బీజేపీ ప్రయాణంపై అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇండియా కూటమిలో ఉన్న అధికార డీఎంకే ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేని బీజేపీ సమదూరంలో ఉంచుతోంది. ఇప్పటివరకు తమిళ్‌మనిలా కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత జీకే వాసన్‌ మాత్రమే బీజేపీతో చేతులు కలిపారు. పుతియా తమిళగంతో పాటు మరికొన్ని మిత్రపక్షాలు డీఎంకే శిబిరంలోకి చేరేలా కనిపిస్తున్నాయి.


ఏఐడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్ సెల్వం, శశికళ, టీటీవీ దినకరన్‌లు ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. అవినీతి, కుటుంబ పాలన వంటి అంశాలపై అధికార డీఎంకేను బీజేపీ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. డీఎంకే 2019 లోక్ సభ ఎన్నికల్లో 39 స్థానాలకుగానూ 38 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అన్నాడీఎంకే ఒక్క సీటుకే పరిమితమైంది.

తమిళనాడు రాజకీయాలు రెండు పార్టీల మధ్యే కేంద్రీకృతమయ్యాయన్న వాతావరణంలో మోదీ పర్యటించడం, ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతారనేది త్వరలోనే తెలుస్తుంది. బీజేపీ రాష్ట్రధ్యక్షుడు అన్నామలై పాదయాత్ర తిరుప్పూర్ జిల్లాలోని పల్లడం వద్ద ముగియనుండగా.. ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీలు బీజేపీలో చేరి మోదీ నాయకత్వానికి బలం చేకూరుస్తాయని అన్నామలై అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 27 , 2024 | 11:28 AM

Advertising
Advertising