PM Narendra Modi: అదే మా మంత్రం.. ప్రధాని మోదీ ప్రసంగంలోకి కీ-పాయింట్స్
ABN, Publish Date - Jul 02 , 2024 | 05:14 PM
అందరికీ న్యాయం అందించడమే తమ మంత్రమని.. ఎవరినీ బుజ్జగించమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పరిపక్వతతో కూడిన తీర్పు ఇచ్చారని..
అందరికీ న్యాయం అందించడమే తమ మంత్రమని.. ఎవరినీ బుజ్జగించబోమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (2024 General Elections) ప్రజలు పరిపక్వతతో కూడిన తీర్పు ఇచ్చారని.. దేశ ప్రజలంతా తమవైపే ఉన్నారని అన్నారు. అబద్ధాలతో మభ్యపెట్టాలని చూసిన వారిని ప్రజలు ఓడించారన్నారు. పదేళ్ల పాలన చూసి తమకు మరోసారి అవకాశం ఇచ్చారన్నారు. గత పదేళ్ల ప్రభుత్వంలో 25 కోట్ల మంది పేదలకు దారిద్య్రం నుంచి విముక్తి కల్పించామని అన్నారు. అవినీతిరహిత పాలన అందించామని మోదీ చెప్పారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగం సందర్బంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని.. ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ట, గౌరవం పెరిగాయని ప్రధాని మోదీ తెలిపారు. ‘భారత్ ప్రథమ్’ అనే తమ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని.. ఏ కార్యక్రమం చేపట్టినా ‘భారత్ ప్రథమ్’ కేంద్రంగానే నడుచుకుంటామని హామీ ఇచ్చారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు అట్టడుగు వర్గాలకు చేరాలనేదే తమ విధానమని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మారుమూల సామాన్యులకూ చేరుతున్నాయన్నారు. 140 కోట్ల ప్రజలకు సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వికసిత్ భారత్ దిశగా తమ సంకల్పంలో ఎలాంటి మార్పు ఉండదని.. వికసిత్ భారత్ సాధించేవరకు తాము పగులూరాత్రి కృషి చేస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారు.
దేశాభివృద్ధితోనే అన్ని పనులు జరుగుతాయని.. భావితరాలకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. తమ పాలనలో పట్టణాలు, నగరాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. గతంలో గ్యాస్ కనెక్షన్ కోసం ఎంపీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడది లేదని పేర్కొన్నారు. 2014కి ముందు పేదలకు రేషన్ బియ్యం దొరకడం కష్టంగానే ఉండేదని విమర్శించారు. తమ హయాంలో మాత్రం దేశంలో అనేక మార్పులొచ్చాయన్నారు. 370 ఆర్టికల్ తొలగించాక జమ్ముకశ్మీర్‌లో రాళ్ల దాడులు తగ్గిపోయాయని అన్నారు. తాము వచ్చాక మేము వచ్చాక తప్పుపట్టిన చట్టాలను రద్దు చేశామని.. ఆర్థిక వ్యవస్థను పదో స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చామని మోదీ చెప్పుకొచ్చారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jul 02 , 2024 | 05:27 PM