మా కుటుంబంపై రాజకీయ కుట్ర: దేవెగౌడ
ABN, Publish Date - May 19 , 2024 | 04:47 AM
రాసలీలల వివాదంలో చిక్కుకున్న ప్రజ్వల్‌పై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ తెలిపారు. తన 91వ జన్మదినం సందర్భంగా బెంగళూరులోని వెంకటేశ్వర ఆలయంలో శనివారం పూజలు జరిపించారు.
బెంగళూరు, మే 18(ఆంధ్రజ్యోతి): రాసలీలల వివాదంలో చిక్కుకున్న ప్రజ్వల్‌పై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ తెలిపారు. తన 91వ జన్మదినం సందర్భంగా బెంగళూరులోని వెంకటేశ్వర ఆలయంలో శనివారం పూజలు జరిపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజ్వల్ వివాదంపై తొలిసారి స్పందించారు. ‘మా కుటుంబంపై రాజకీయ కుట్ర జరిగింది. కుట్రలో అనేకమంది పాత్ర ఉంది. లోక్‌సభ ఫలితాల తర్వాత మాట్లాడతా’ అని దేవెగౌడ అన్నారు.
Updated Date - May 19 , 2024 | 04:47 AM