LokSabha Elections: ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల దుమారంపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
ABN, Publish Date - Apr 30 , 2024 | 02:21 PM
జేడీ(ఎస్) యువనేత, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్నాయి. దీంతో అతడిపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా.. అతడికి షోకాజ్ నోటిసులు సైతం జారీ చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 30: జేడీ(ఎస్) యువనేత, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ( prajwal revanna) అశ్లీల వీడియోలు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్నాయి. దీంతో అతడిపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా.. అతడికి షోకాజ్ నోటిసులు సైతం జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజ్వల్ వీడియోలు ప్రత్యర్థి రాజకీయ పార్టీల చేతుల్లో రాజకీయ ఆస్త్రంగా మారాయి.
ఇక ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీతో కలిసి జేడీఎస్ పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు.. బీజేపీని లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడికి దిగారు. దీంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం.. ఈ వీడియోలపై తనదైన శైలిలో స్పందించారు.
Junk Food: జంక్ ఫుడ్ తిని అస్వస్థత.. ఏ ఔట్ లెట్ నుంచి బుక్ చేశారో తెలుసా..?
అయితే టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ (poonam kaur) సైతం ప్రజ్వల్ వీడియోలపై తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా తెలియజేశారు. ఒక మంత్రి కుమారుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి బ్లాక్ మెయిల్ చేస్తే.. మరో మంత్రి కుమారుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మండిపడ్డారు.
High Court: జనసేన గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టులో విచారణ
మంత్రి కుమారుడు 2,800 మంది మహిళలను బలవంతంగా లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా.. వీడియోలు సైతం తీశారన్నారు. డబ్బు, అధికారం.. రెండు ఉన్న వాళ్లను ఈ ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. జర్మనీలో ప్రజ్వల్ హాయిగా ఉన్నాడని తెలిపారు. అయితే అతడికి శిక్ష పడుతుందా? లేదా? అనేది కూడా చెప్పలేమని పూనమ్ కౌర్ అభిప్రాయపడ్డారు.
మీ అందరికీ చేతులు జోడించి ఓ మహిళగా ప్రార్ధిస్తున్నాను.. మీ కుమార్తెలపై, సోదరిమణులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా... వారితో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. అయితే మహిళలను వేధించే వారికి, మహిళలకు గౌరవించని వారికి ఓటు వేయవద్దని సూచించారు. ఎన్నికల్లో ఓటు ఎవరికీ వేయాలనేది ఆలోచించి వేయాలని విజ్జప్తి చేశారు.
karnataka politics: ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు
మహిళలకు రక్షణ కల్పించే వారికే ఓటు వేయండని చెప్పారు. అన్యాయం చేసే వారికి అధికారం ఇవ్వద్దన్నారు. మహిళలను పూజించే దేశంలో ఇలాంటి వారిని గెలిపిద్దామా? అని పూనమ్ కౌర్ ఈ సందర్బంగా ప్రశ్నించారు. మహిళలను బలవంతం చేసిన ప్రజ్వల్ రేవణ్ణను వదిలిపెట్ట వద్దన్నారు. ఈ దేశం రావణ రాజ్యం వైపు వెళ్తుందా? లేక రామ రాజ్యం వైపు వెళ్తుందా? అని ప్రశ్నించారు.
Read latest National News And Telugu News
Updated Date - May 02 , 2024 | 01:05 PM