Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురు..బెయిలుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ
ABN, Publish Date - Jun 26 , 2024 | 05:19 PM
లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ, జేడీ(ఎస్) బహిష్కృత నేత ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ అభ్యర్థనను ఈ కేసును విచారిస్తు్న్న ప్రత్యేక ప్రజా ప్రాతినిధ్య కోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది.
బెంగళూరు: లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ, జేడీ(ఎస్) బహిష్కృత నేత ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ అభ్యర్థనను ఈ కేసును విచారిస్తు్న్న ప్రత్యేక ప్రజా ప్రాతినిధ్య కోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది. హోలెనరసిపుర పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ నిందితులుగా ఉన్నారు. లైంగిక నేరాల కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కస్టడీలో ప్రస్తుతం ప్రజ్వల్ ఉన్నారు.
Lok Sabha: లోక్‌సభ స్పీకర్‌గా తొలి ప్రసంగంలోనే ఓం బిర్లా నోట ఎమర్జెన్సీ మాట..
ప్రజ్వల్ రేవణ్ణ ప్రమేయం ఉన్నట్టు చెబుతున్న లైంగిక దాడుల వీడియోలు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు వెలుగులోకి రావడం ఒక్కసారిగా సంచలనమైంది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం 'సిట్'ను ఏర్పాటు చేయగా, అప్పటికే జర్మనీ పారిపోయిన ప్రజ్వల్ సిట్ చర్యలతో దిగొచ్చారు. సిట్ విజ్ఞప్తితో బ్లూ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ జారీ చేసింది. ఈ క్రమలో మే 31న విచారణ కోసం జర్మనీ నుంచి తిరిగొచ్చిన ప్రజ్వల్‌ను సిట్ అదుపులోనికి తీసుకుంది. కాగా, పలువురు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణను కూడా పోలీసులు గత శనివారం అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jun 26 , 2024 | 05:19 PM