ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prashant Kishor: కొత్త పార్టీ నాయకుడెవరనే దానిపై ప్రశాంత్ కిషోర్ ట్విస్ట్

ABN, Publish Date - Sep 29 , 2024 | 05:05 PM

జన్ సురాజ్ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పేరు, నాయకత్వం తదితర వివరాలను అక్టోబర్ 2వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు.

పాట్నా: జన్ సురాజ్ (Jan Suraaj) నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పేరు, నాయకత్వం తదితర వివరాలను అక్టోబర్ 2వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. 2022 అక్టోబర్ 2న 'జన్ సురాజ్' పేరుతో ఆయన ప్రారంభించిన యాత్ర రెండేళ్ల పూర్తి చేసుకోనున్న సందర్భంగా పాట్నాలో ఆదివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం కావాలని సూచించారు.


నాయకుడిని కావాలని ఎన్నడూ అనుకోలేదు...

కొత్త పార్టీకి తాను నాయకుడిని కాదని, అలా ఉండాలని తాను ఎన్నడూ అనుకోలేదని ప్రశాంత్ కిషోర్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రజలే నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి ఇదే సరైన తరుణమని అన్నారు. 2022 మే 5న జన్ సురాజ్ జర్నీ మొదలవుతోందని తాను ప్రకటించానని, మూడు ప్రధాన ఉద్దేశాలతో జన్ సురాజ్ యాత్ర చేపట్టడం, దాని గురించి చర్చించడం జరిగిందని అన్నారు. 2.5 ఏళ్ల పాటు సాగిన ప్రయాణం అక్టోబర్ 2వ తేదీన కీలక మైలురాయికి చేరుకోనుందన్నారు. ఇంతవరకూ సాగించిన ప్రయత్నాల ఫలితంగా జన్‌ సురాజ్ అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీగా అవతరించనుందని తెలిపారు.

PM Modi: పుణె మెట్రో సెక్షన్‌ను ప్రారంభించిన మోదీ


3 ప్రధాన లక్ష్యాలివే..

జన్ సురాజ్ యాత్రను తాను 3 ప్రధాన లక్ష్యాలతో చేపట్టి ప్రజల వద్దకు తీసుకువెళ్లినట్టు ప్రశాంత్ కిషోర్ చెప్పారు. రాష్ట్ర ప్రజలు, వారి చిన్నారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడం మొదటిదని, ఇందుకోసం గ్రామగ్రామానికి వెళ్లి వారిని చైతన్యవంతులను చేశామని చెప్పారు. తప్పుదారి పట్టించే నేతలకు ఓటు వేయరాదని ప్రజల్లో అవగాహన కల్పించడం రెండో ఉద్దేశమన్నారు. బీహార్ ప్రగతికి పనిచేయడం మూడో ఉద్దేశమని చెప్పారు. విద్య, వ్యవసాయం, ఉద్యోగితపై దృష్టి పెట్టి 8,500 పంచాయితీల అభివృద్ధికి వ్యూహాలను రూపొందించడం ద్వారా టాప్-10 రాష్ట్రాల్లో బీహార్‌ నిలిచేలా చేయాలనేది తమ ఉద్దేశమని చెప్పారు. ఈ మూడు ఉద్దేశాలతో 2022 అక్టోబర్ 2న వెస్ట్‌ చంపరాన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి తమ యాత్ర ప్రారంభించామని, ఇందుకోసం ఇన్ని కిలోమీటర్లు తిరగాలని కానీ, ఇన్ని రోజులు పర్యటించాలని కానీ తాను అనుకోలేదని చెప్పారు. తమ లక్ష్య సాధనలో భాగంగా బీహార్‌లోని 60 శాతం ప్రాంతాల్లో పర్యటించామని, తదుపరి యాత్ర కూడా కొనసాగుతుందని తెలిపారు.


For National News And Telugu News..

ఇది కూడా చదవండి...

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

Updated Date - Sep 29 , 2024 | 05:05 PM