Holi: రంగులు దేశ వైవిధ్యానికి ప్రతీకన్న ద్రౌపది ముర్ము.. పౌరులకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, షా
ABN, Publish Date - Mar 25 , 2024 | 12:11 PM
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. హోలీ రంగులు దేశ వైవిధ్యానికి ప్రతీకలని ఆమె అన్నారు.
ఢిల్లీ: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. హోలీ రంగులు దేశ వైవిధ్యానికి ప్రతీకలని ఆమె అన్నారు. సోమవారం ఓ సందేశంలో ఆమె మాట్లాడుతూ.. "హోలీ ప్రజల ప్రేమ, ఐక్యత, సోదర భావాన్ని పెంపొందిస్తుంది.
దేశ సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఈ రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలి. కొత్త ఉత్సాహంతో దేశ నిర్మాణానికి కృషి చేయడానికి మనందరికీ శక్తినివ్వాలి" అని అన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ సైతం హోలీ సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌లో సంబంధిత పోస్ట్‌ను షేర్ చేశారు. "అనురాగం, సామరస్యం అనే రంగులతో అలంకరించిన ఈ సంప్రదాయ పండుగ మీ జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలి" అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో హోలీ ఆనందం, శ్రేయస్సు, సామరస్యం, కొత్త శక్తిని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 25 , 2024 | 12:13 PM