ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

President of the United Nations: పేదరికం నుంచి 80 కోట్ల మందికి విముక్తి!

ABN, Publish Date - Aug 03 , 2024 | 04:00 AM

భారత్‌లో 80 కోట్ల మంది ప్రజలు కేవలం ఐదారేళ్లలోనే పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి(ఐరాస) జనరల్‌ అసెంబ్లీ(యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ తెలిపారు.

  • భారత్‌లో స్మార్ట్‌ ఫోన్లతో సాధ్యమైందన్న

  • ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు

న్యూయార్క్‌, ఆగస్టు 2: భారత్‌లో 80 కోట్ల మంది ప్రజలు కేవలం ఐదారేళ్లలోనే పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి(ఐరాస) జనరల్‌ అసెంబ్లీ(యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ తెలిపారు. దీనికి కారణం స్మార్ట్‌ ఫోన్ల వినియోగమేనని పేర్కొన్నారు. ‘‘భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఒకప్పుడు బ్యాంకు లావాదేవీలు తెలియవు.

చెల్లింపులు ఎలా చేయాలో తెలీదు. కానీ, ఈ రోజు వారంతా తమ బిల్లులను స్మార్ట్‌ ఫోన్ల ద్వారా చెల్లిస్తున్నారు. నగదును అందుకుంటున్నారు. ఆర్డర్లు పెడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. వేగవంతమైన అభివృద్ధికి డిజిటలైజేషన్‌ ఎంతగానో ఉపయోగపడిందన్నారు.

ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు కూడా ఫోన్‌ సిగ్నల్స్‌ అందించడం, ఇంటర్నెట్‌ను విస్తరించడం వంటివి దీనికి దోహదపడ్డాయని తెలిపారు. దక్షిణాసియాలోని ఇతర దేశాలు కూడా భారత్‌ మాదిరిగా డిజిటలైజేషన్‌లో దూసుకుపోవాల్సిన అవసరం ఉంద ని ఫ్రాన్సిస్‌ పేర్కొన్నారు. ‘‘గ్రామీణ భారతంలోని రైతులు ఒకప్పుడు బ్యాంకిం గ్‌ వ్యవస్థకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉండడంతో వారి వ్యాపార లావాదేవీలన్నీ వాటి ద్వారానే సాగుతున్నాయి’’ అని తెలిపారు.

Updated Date - Aug 03 , 2024 | 04:00 AM

Advertising
Advertising
<