ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రథమ వందేభారత్‌ మెట్రో ప్రారంభం రేపు

ABN, Publish Date - Sep 15 , 2024 | 03:47 AM

దేశంలోని ప్రప్రథమ వందేభారత్‌ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇది అహ్మదాబాద్‌-భుజ్‌ల మధ్య తిరగనుంది.

అహ్మదాబాద్‌, సెప్టెంబరు 14: దేశంలోని ప్రప్రథమ వందేభారత్‌ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇది అహ్మదాబాద్‌-భుజ్‌ల మధ్య తిరగనుంది. మొత్తం ఏసీ బోగీలు ఉన్న ఈ రైలుకు ఎలాంటి రిజర్వేషన్‌ సౌకర్యం ఉండదు. రైలు బయలుదేరడానికి కొద్ది సేపు ముందు కౌంటర్‌లో టిక్కెట్లు తీసుకుంటే సరిపోతుంది. 1,150 మంది కూర్చోవడానికి, 2,058 మంది నిల్చోవడానికి ఇందులో సౌకర్యాలు ఉన్నాయి. ఇది గంటకు 110 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. కాగా, దుర్గ్‌ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయోగాత్మకంగా నడుస్తున్న వందేభారత్‌ రైలుపై ఛత్తీ్‌సగఢ్‌లోని మహాసముంద్‌ జిల్లా బాగ్‌బహరా స్టేషన్‌ వద్ద కొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మూడు బోగీల అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ రైలును సోమవారం అధికారికంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం.

Updated Date - Sep 15 , 2024 | 03:47 AM

Advertising
Advertising