Sikkim: సిక్కింలో తొలి రైల్వేస్టేషన్.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ..
ABN, Publish Date - Feb 25 , 2024 | 09:26 PM
ఇప్పటివరకు రైల్వే స్టేషన్ లేని రాష్ట్రంగా ఉన్న సిక్కిం.. ఇక ముందు రైలు సర్వీసులను ప్రారంభించనుంది. సిక్కింలో తొలి రైల్వే స్టేషన్ రంగ్‌పో ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
ఇప్పటివరకు రైల్వే స్టేషన్ లేని రాష్ట్రంగా ఉన్న సిక్కిం.. ఇక ముందు రైలు సర్వీసులను ప్రారంభించనుంది. సిక్కింలో తొలి రైల్వే స్టేషన్ రంగ్‌పో ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. మూడు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. మొదటి దశలో రంగ్‌పో నుంచి సివోక్, రెండో దశలో రంగ్‌పో నుంచి గాంగ్‌టక్, మూడో దశలో గాంగ్‌టక్ నుంచి నాథులా వరకు నిర్మించనున్నారు. 2024 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని భావించినప్పటికీ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తుల కారణంగా 2025కు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
భారతీయ రైలు నెట్‌వర్క్ రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రంగా సిక్కిం ఉంది. సిక్కింకు కేవలం రోడ్డు మార్గం ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. రాంగ్ పో-సివోక్ రైలు ప్రాజెక్టు మొత్తం పొడవు 44.96 కిలోమీటర్లు. ఇందులో 38.65 కిలోమీటర్లు సొరంగాలు, 2.24 కిలోమీటర్లు వంతెనలు ఉన్నాయి. ట్రాక్ వర్క్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఈ లైన్‌లో ఉన్న 14 సొరంగాల్లో అత్యంత పొడవైనది 5.30 కిలోమీటర్లు ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 25 , 2024 | 09:27 PM