మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anant Radhika Wedding: అనంత్ వాచ్ చూసి ముచ్చటపడ్డ జుకర్ బర్గ్ సతీమణి

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:54 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ గుజరాత్‌ జామ్ నగర్‌లో వైభవంగా జరుగుతోంది. మూడు రోజుల వేడుకకు పలువురు ప్రముఖులు తరలొచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచంలోని టాప్ కంపెనీల సీఈవోలు వచ్చారు. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్క్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ జామ్ నగర్‌కు రాగా, అనంత్ అంబానీ స్వయంగా స్వాగతం పలికారు.

Anant Radhika Wedding: అనంత్ వాచ్ చూసి ముచ్చటపడ్డ జుకర్ బర్గ్ సతీమణి

జామ్ నగర్: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani)- రాధిక (Radhika) మర్చంట్ ప్రీ వెడ్డింగ్ గుజరాత్‌ జామ్ నగర్‌లో వైభవంగా జరుగుతోంది. మూడు రోజుల వేడుకకు పలువురు ప్రముఖులు తరలొచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచంలోని టాప్ కంపెనీల సీఈవోలు వచ్చారు. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్క్, ఆయన సతీమణీ ప్రిసిల్లా చాన్ జామ్ నగర్‌కు రాగా, అనంత్ అంబానీ (Anant Ambani) స్వయంగా స్వాగతం పలికారు.

ఇది నాకు కావాలి: ప్రిసిల్లా

అనంత్ అంబానీ- రాధిక ప్రీ వెడ్డింగ్ కోసం మార్క్ జుకర్ బర్గ్ దంపతులు వచ్చారు. అనంత్ చేతికి ఉన్న వాచ్ మీద జుకర్ బర్గ్, ప్రిసిల్లా చాన్ కన్ను పడింది. అనంత్ ధరించింది సాదా సీదా వాచ్ కాదు.. రిచర్డ్ మిల్లే వాచ్. దాని ధర రూ.కోట్లలో ఉంటుంది. ఆ లగ్జరీ వాచ్ గురించి అనంత్‌ను ప్రిసిల్లా ప్రశ్నలు వేసింది. వాచ్ చూసి జుకర్ బర్గ్ కూడా ముచ్చట పడ్డారు. ఆ వాచ్ తనకు కావాలని ప్రిసిల్లా చాన్ జుకర్ బర్గ్‌తో అన్నారు. ఆ వీడియో సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

అద్భుతంగా అనంత్ వాచ్

‘అనంత్ మీ వాచ్ అద్భుతంగా ఉంది. చూడముచ్చటగా ఉంది. వాచ్ ఏ కంపెనీది అని అడగగా, రిచర్డ్ మిల్లే అంటూ అనంత్ సమాధానం ఇచ్చాడు. తాను ఇన్నాళ్లూ వాచ్ కొనాలని అనుకోలేదు. మీ వాచ్ చూసిన తర్వాత గడియారం అంటే తనకు ఇష్టం కలిగింది అని’ ప్రిసిల్లా చాన్ అనంత్ అంబానీతో అనింది. అనంత్ వాచ్ బాగుందని అతనితో చెప్పానని జుకర్ బర్గ్ చెప్పారు. రిచర్డ్ మిల్లే వాచ్ బాగుంటాయని జుకర్ బర్గ్ అనగా.. ఆ వాచ్ తనకు కావాలని ప్రిసిల్లా కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 12:57 PM

Advertising
Advertising