ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttar Pradesh: మొరాదాబాద్‌ దారుణం.. నర్స్‌పై లైంగిక దాడి.. ఆసుపత్రి సీజ్

ABN, Publish Date - Aug 20 , 2024 | 04:21 PM

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్‌పై వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

లఖ్‌నవూ, ఆగస్ట్ 20: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్‌పై వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 17వ తేదీ రాత్రి.. విధుల్లో ఉన్న తన కుమార్తెను గదిలో బంధించి.. ఆమెపై వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో తన కుమార్తెను కులం పేరుతో వైద్యుడు దూషించారని స్పష్టం చేశారు.

Also Read: Karnataka: సీఎం సీటు కోసం డీకే శివకుమార్ తాపత్రయమా..?


వైద్యుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు..

దాంతో వైద్యుడిపై న్యాయ సంహిత చట్టం కింద పలు సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ లైంగిక దాడి ఘటనపై మొరదాబాద్ ఎస్పీ స్పందించారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఆసుపత్రిని సీజ్ చేశామని తెలిపారు. ఈ కేసుతో ప్రమేయముందని భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.

Also Read: Spurious Liquor: కల్తీ మద్యం తాగి.. 14 మందికి తీవ్ర అస్వస్థత


వైద్యుడికి ఉరి శిక్ష విధించాలి..

మరోవైపు లైంగిక దాడికి పాల్పడిన వైద్యుడికి ఉరి శిక్ష విధించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. తన కుమార్తె గత 10 మాసాలుగా ఆసుపత్రిలో నర్స్‌గా విధులు నిర్వహిస్తుందని గుర్తు చేశారు.


నర్స్‌గా పని చేస్తూ.. మరోవైపు డిగ్రీ చదువుతుంది..

ఓ వైపు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ.. మరోవైపు ప్రైవేట్‌గా డిగ్రీ చదువుకుంటుందన్నారు. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం తన కుమార్తెకు ఎటువంటి జీతం ఇంత వరకు చెల్లించడం లేదని స్పష్టం చేశారు. అయితే ఇంటి నుంచి ఆసుపత్రికి ప్రయాణ ఖర్చులు కింద నగదు చెల్లించేవారని వివరించారు. ఇక ఈ లైంగిక దాడి ఘటనను బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని తమ కుమార్తెను వైద్యుడు బెదిరించాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన అనంతరం తన కుమార్తె ఇంటికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Aug 20 , 2024 | 04:21 PM

Advertising
Advertising
<