ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Priyanka Gandhi: కొప్పళ లోక్ సభ బరిలో ప్రియాంక గాంధీ?

ABN, Publish Date - Jan 30 , 2024 | 01:14 PM

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని గత రెండురోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు దాకా ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది.

- ఢిల్లీ నేతల పర్యవేక్షణలో సర్వేలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని గత రెండురోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు దాకా ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రియాంకగాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించడం ద్వారా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించవచ్చునని రాష్ట్ర పార్టీ నేతలు ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. అందుకే సురక్షితమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలకు సమాచారం లేకుండానే ఢిల్లీ ముఖ్యుల పర్యవేక్షణలోని బృందాలు కొప్పళ నియోజకవర్గంలో సర్వే జరిపినట్లు తెలిసింది. ప్రియాంకగాంధీని తెలంగాణ నుంచి కూడా పోటీ చేయించాలనే డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం దక్షిణాదిన రెండు రాష్ట్రాల్లో పటిష్టమైన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నందున ఇక్కడి నుంచే పోటీ చేయించాలని తద్వారా ఇక్కడ ఎక్కువ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికగా ప్రియాంకగాంధీని ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలకు సమగ్ర సమాచారం లేక పోవడంతో ఈ ప్రచారంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. బీజేపీకి చెందిన కొప్పళ లోక్‌సభ సభ్యుడు కరడి సంగణ్ణకు సొంతపార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అతడికి కాకుండా మరెవరికైనా టికెట్‌ ఇవ్వాలని బహిరంగంగానే నియోజకవర్గానికి చెందిన ముఖ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రను కలిసిన స్థానిక ముఖ్యులు మరోసారి సంగణ్ణకు టికెట్‌ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండటం, పైగా ఎన్నికలకు ముందు ప్రకటించిన ఐదు గ్యారెంటీలు అమలుచేస్తుండటంతో లోక్‌సభ ఎన్నికలలోను గెలుపు సునాయాసమని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. కొప్పళ పరిధిలో 8 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా ఆరుచోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించగా ఒక స్థానంలో గాలి జనార్దనరెడ్డి మరోస్థానంలో బీజేపీ విజయం సాధించాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నందున విజయం సాధ్యమనే అంచనాలతోనే ప్రియాంకగాంధీని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రానికి గాంధీ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం

రాష్ట్రానికి గాంధీ కుటుంబంతో దశాబ్దాలుగా ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. ఇందిరాగాంధీకి రాజకీయంగా పునర్జన్మ ఇక్కడి నుంచే సాధ్యమైంది. చిక్కమగళూరు నుంచి ఇందిరాగాంధీ విజయం సాధించగా 1999లో సోనియాగాంధీ బళ్లారి నుంచి పోటీ చేసి విజయం నమోదు చేశారు. అదే తరహాలోనే ప్రియాంకగాంధీని కూడా రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని అధిష్టానం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియాంకగాంధీ పోటీపై రెండు వారాలలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Jan 30 , 2024 | 01:14 PM

Advertising
Advertising