Priyanak Gandhi: ప్రియాంక గాంధీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే
ABN, Publish Date - Oct 23 , 2024 | 09:25 PM
ప్రియాంక గాంధీ ఉన్న ఆస్తుల్లో రూ.4.25 కోట్ల చరాస్తులు ఉన్నాయి. వాటిలో మూడు బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పీపీఎఫ్, రాబర్డ్ వాద్రా గిఫ్ట్‌గా ఇచ్చిన హోండా సీఆర్‌వీ కారు, రూ.1.15 కోట్లు విలువచేసే 4400 గ్రాములకు పైగా బంగారం ఉన్నాయి.
వయనాడ్: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల (Assets) వివరాలు వెల్లడించారు. ఆ అఫిడవిట్ ప్రకారం ప్రియాంకకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.46.39 లక్షలని ఆమె ప్రకటించారు.
Jagadambika Pal: తృటిలో తప్పించుకున్నా.. దాడి ఘటనపై జేపీసీ చీఫ్
ప్రియాంక గాంధీ ఉన్న ఆస్తుల్లో రూ.4.25 కోట్ల చరాస్తులు ఉన్నాయి. వాటిలో మూడు బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పీపీఎఫ్, రాబర్డ్ వాద్రా గిఫ్ట్‌గా ఇచ్చిన హోండా సీఆర్‌వీ కారు, రూ.1.15 కోట్లు విలువచేసే 4400 గ్రాములకు పైగా బంగారం ఉన్నాయి.
స్థిరాస్తుల విలువ రూ.7.74 కోట్లు. వీటిలో న్యూఢిల్లీలోని మెహ్రౌలి ఏరియాలో రెండు అగ్రికల్చరల్ ల్యాండ్స్ (ఇన్‌హెరిటెడ్ హాఫ్-షేర్స్), ఫామ్‌హౌస్‌లో హాఫ్-షేర్ వంటివి ఉన్నాయి. సొంతంగా హిమాచల్ ప్రదేశ్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంది. దీని విలువ రూ.5.63 కోట్లు. రూ.15.75 కోట్ల మేరకు రుణాలు కూడా ఉన్నాయి. అదనంగా ఆమెపై రెండు ఎఫ్ఐఆర్‌లు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ఒక నోటీసు ఉన్నట్టు ఆ అఫిడవిట్‌లో ప్రియాంక తెలిపారు. ప్రియాంక భర్త, వ్యాపారవేత్త రాబర్డ్ వాద్రాకి రూ.37.9 కోట్లు విలువచేసే చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.
ప్రియాంక గాంధీ తన చదువు వివరాలను కూడా అఫిడవిట్‌లో ప్రకటించారు. యూకేలోని సుందర్‌లాండ్ యూనివర్శిటీ నుంచి దూరవిద్య ద్వారా బుద్దిస్ట్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్రొమో చేశారు. ఢిల్లీ యూనివర్శిటీలో సైకాలజీలో బీఏ హానర్స్ డిగ్రీ ఉంది.
ఇవి కూడా చదవండి..
Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..
Priyanka Gandhi: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ.. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్..
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 23 , 2024 | 09:28 PM