మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Birthday Cake: బర్త్‌డే వేడుకలో విషాదం.. ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిన కేక్ తిని 10 ఏళ్ల బాలిక దుర్మరణం

ABN, Publish Date - Mar 30 , 2024 | 09:40 PM

పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిన కేక్ తిన్న ఓ పదేళ్ల చిన్నారి దుర్మరణం చెందిన ఘటన పంజాబ్‌లో తాజాగా వెలుగు చూసింది

Birthday Cake: బర్త్‌డే వేడుకలో విషాదం.. ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిన కేక్ తిని 10 ఏళ్ల బాలిక దుర్మరణం

ఇంటర్నెట్ డెస్క్: పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిన కేక్ తిన్న ఓ పదేళ్ల చిన్నారి దుర్మరణం చెందిన ఘటన పంజాబ్‌లో (Punjab) తాజాగా వెలుగు చూసింది. కేక్ విషపూరితం కావడంతో బాలిక మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాన్వీ అనే బాలిక మార్చి 24న సాయంత్రం వేళ పుట్టిన రోజు వేడుక జరుపుకుంది. తల్లిదండ్రులు, తోబుట్టువుల మధ్య బాలిక కేక్ కట్ చేసింది. ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిన ఆ కేక్‌ను కుటుంబమంతా ఇష్టంగా తిన్నారు. ఆ తరువాత కొన్ని గంటలకే మాన్వీతో పాటు ఆమె తోబుట్టువులు కూడా అనారోగ్యం పాలయ్యారు (Girl dies after eating cake ordered online).

Viral: ట్రాఫిక్ జాంలో ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ చేస్తోందేంటో రికార్డు చేసి నెట్టింట పెడితే..


తనకు బాగా దాహం వేస్తోందని, నోరు ఎండిపోతున్నట్టు ఉందని మాన్వీ చెప్పడంతో తల్లిదండ్రులు మంచి నీళ్లు ఇచ్చారు. మరోవైపు, మాన్వీ తొబుట్టువులు కూడా వాంతుల చేసుకున్నారు. అయితే, తెల్లారేసరికాల్లా మాన్వి ఆరోగ్యం మరింత దిగజారడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా మాన్వీ చికిత్స పొందుతూ కన్నుమూసింది. పాటియాలాలోని కేక్ కన్హా షాపు నుంచి ఆన్‌లైన్‌లో కేక్ ఆర్డరిచ్చినట్టు మాన్వీ కుటుంబసభ్యులు తెలిపారు. కేక్‌‌లో ఏదైనా విషపూరిత పదార్థం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

కాగా, ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు మాన్వీ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బర్త్‌డే కేక్ శాంపిల్‌నూ పరీక్షల కోసం లాబ్‌కు పంపించారు. ఈ ఫలితాల వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 09:48 PM

Advertising
Advertising