ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోదీకి సాధ్యం కాని పని.. మేం చేసి చూపిస్తున్నాం!

ABN, Publish Date - Nov 21 , 2024 | 04:55 AM

ప్రధాని మోదీ గత మూడేళ్లలో చేయలేని కులగణనను తెలంగాణలోని తమ ప్రభుత్వం మరో మూడు వారాల్లో పూర్తి చేయనుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

  • తెలంగాణలో మరో 3 వారాల్లో కులగణన పూర్తి: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, నవంబరు 20: ప్రధాని మోదీ గత మూడేళ్లలో చేయలేని కులగణనను తెలంగాణలోని తమ ప్రభుత్వం మరో మూడు వారాల్లో పూర్తి చేయనుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ‘తెలంగాణలో మా ప్రభుత్వం ఇప్పటికే 70 శాతానికిపైగా కులగణనను పూర్తి చేసింది. విధానాల రూపకల్పనలో, సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయటంలో ఆ సమాచారాన్ని వినియోగిస్తాం’ అని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో రాహుల్‌ హిందీలో ఓ పోస్ట్‌ పెట్టారు. వచ్చే కొన్ని దశాబ్దాల కాలంలో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించటానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన చర్యల్లో కులగణన మొట్టమొదటిదని రాహుల్‌ స్పష్టం చేశారు. అందువల్లే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన జరగాలని తాను పదేపదే డిమాండ్‌ చేస్తున్నానన్నారు. ‘తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశానికి దారి చూపింది. జాతీయస్థాయిలోనూ కులగణన జరిగేలా చర్యలు తీసుకుంటాం’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 04:56 AM