ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: పేపర్ లీక్‌ల పునరావృతం...చరిత్ర క్షమించదన్న రాహుల్

ABN, Publish Date - Feb 27 , 2024 | 05:37 PM

పేపర్ లీక్‌లు పునరావృతం అవుతుండటంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై మంగళవారంనాడు నిప్పులు చెరిగారు. దేశ భవిష్యత్తుకు శత్రువుగా మారుతోందంటూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఉద్యోగాలు సృష్టించే సంస్థలను తమ మిత్రులకు అమ్ముకుంటున్నారని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం 'ఎక్స్‌'లో ఆరోపించారు.

న్యూఢిల్లీ: పేపర్ లీక్‌లు (paper leaks) పునరావృతం అవుతుండటంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మోదీ సర్కార్‌పై మంగళవారంనాడు నిప్పులు చెరిగారు. దేశ భవిష్యత్తుకు శత్రువుగా మారుతోందంటూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఉద్యోగాలు సృష్టించే సంస్థలను తమ మిత్రులకు అమ్ముకుంటున్నారని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం 'ఎక్స్‌'లో ఆరోపించారు.


''దేశ భవిష్యత్తుకు మోదీ ప్రభుత్వం శత్రువుగా మారుతోంది. ఒకచోట విద్యార్థులు రిక్రూట్‌మెంట్‌పై ఆతృతతో ఉన్నారు. మరోచోట పేపర్ లీక్‌లతో నిస్పృహకు గురవుతున్నారు. ఇంకోచోట విద్యార్థులు అపాయింట్‌మెట్ల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరో చోట గొంతెత్తినందుకు లాఠీ దెబ్బలు చవిచూస్తున్నారు'' అని రాహుల్ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం కనీసం ఒక్క పరీక్ష కూడా సజావుగా నిర్వహించడంలో విఫలమైందని, ఆర్ఓ-ఏఆర్‌ఓ నుంచి పోలీస్ రిక్రూట్ మెంట్ వరకూ, రైల్వేల నుంచి ఆర్మీ వరకూ యువతపై ఆగ్రహం వెళ్లగక్కుతోందన్నారు. ఉద్యోగాలు సృష్టించే సంస్థలను తమ మిత్రులకు అమ్ముకోవడం, యువకులను కాంట్రాక్టు కార్మికులు మార్చడం మోదీ విధానంగా మారిందని, వంచనకు పాల్పడటమే మోదీ విధానమని రాహుల్ తప్పుపట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కలలకు మోదీ ప్రభుత్వం ఒక గ్రహణంలా మారిందని, ఈ నేరానికి చరిత్ర ఎప్పటికీ మోదీని క్షమించదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


పేపర్ లీక్‌తో యూపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రద్దు

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 17, 18 తేదీల్లో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్‌‌ను 24వ తేదీన రద్దు చేసింది. పేపర్ లీక్ కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు ఈ పరీక్షలను నిర్వహించింది. దీనికి ముందు కూడా రాజస్థాన్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్, హర్యానాలో గ్రూప్-డి పోస్టులకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ), గుజరాత్‌లో జూనియర్ క్లర్క్స్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్, బీహార్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌లు పేపర్ లీక్‌ల కారణంగా రద్దయ్యారు.

Updated Date - Feb 27 , 2024 | 05:37 PM

Advertising
Advertising