ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: రాజ్‌నాథ్‌కు రాహుల్ వినూత్న గిఫ్ట్

ABN, Publish Date - Dec 11 , 2024 | 04:28 PM

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు బుధవారంనాడు పార్లమెంటు వెలుపల నిలబడి సభలకు హాజరవుతున్న బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం, గులాబీలు అందించారు.

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో పలు అంశాలపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు, బీజేపీ మధ్య ఓవైపు ప్రతిష్ఠంభన కొనసాగుతుండగా, మరోవైపు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు 'అదానీ' అంశంపై చర్చ జరపాలంటూ వినూత్న రీతిలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు బుధవారంనాడు పార్లమెంటు వెలుపల నిలబడి సభలకు హాజరవుతున్న బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం, గులాబీలు అందించారు. ఆ సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్కడకు రావడంతో రాహుల్ గాంధీ వేగంగా వెళ్లి ఆయన చేతికి త్రివర్ణ పతాకం, గులాబీ అందించారు. రక్షణమంత్రికి రాహుల్ గులాబీ ఇవ్వడం అంతా ఆసక్తిగా వీక్షించారు.

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి


'అదానీ' అంశంపై పార్లమెంటులో చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతుండగా, కాంగ్రెస్-సోరోస్ సంబంధాలను బీజేపీ నిలదీస్తోంది. దీంతో సభా కార్యక్రమాలకు సజావుగా ముందుకు సాగడం లేదు. దీంతో అదానీ అంశంపై చర్చ జరపాల్సిందేనంటూ కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు పార్లమెంటు వెలుపల వినూత్న నిరసనలు సాగిస్తున్నారు. సోమవారంనాడు ఎంపీలు మోదీ, అదానీ మాస్క్‌లు ధరించగా వారితో విపక్ష నేత రాహుల్ ఇంటర్వ్యూ చేశారు. మంగళవారం సైతం ప్రధాని, అదానీ క్యారికేచర్లు ఉన్న బ్యాగులు ధరించి కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. 'మోదీ అదానీ భాయ్ భాయ్' అనే నినాదం బ్యాగులపై ముద్రించారు.


కాగా, జాతీయ జెండా, గులాబీలతో నిరసన తెలపడంపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వివరణ ఇచ్చారు. ఇతర విషయాల కంటే దేశం చాలా ముఖ్యమైనదని బీజేపీ నేతలకు తెలియజెప్పేందుకే వారికి జాతీయ జెండాలు ఇచ్చినట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్‌..

For National news And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 04:30 PM