Congress: కట్టుదిట్టమైన ఈసీ నిఘా.. రాహుల్ హెలికాప్టర్ తనిఖీ
ABN, Publish Date - Apr 15 , 2024 | 02:12 PM
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ నిఘాను పటిష్టం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చెందిన హెలికాఫ్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. తమిళనాడు నీలగిరి జిల్లాలో రాహుల్ పర్యటన కోసం వచ్చిన హెలికాఫ్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.
చెన్నై: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ నిఘాను పటిష్టం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చెందిన హెలికాఫ్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. తమిళనాడు నీలగిరి జిల్లాలో రాహుల్ పర్యటన కోసం వచ్చిన హెలికాఫ్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.
సోమవారం నీలగిరి నుంచి తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌కు వెళ్తున్నారు. ఆయన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన హెలికాప్టర్‌ను ఎన్నికల ప్లయింగ్ స్వ్కాడ్ అధికారులు తనిఖీ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పలు వాహనాలను తనిఖీ చేస్తున్న విషయం తెలిసిందే. నగదు, మద్యం తదితర వస్తువులతో పార్టీలు ప్రజలను మభ్యపెట్టకుండా ఉండేందుకు ఈసీ తనిఖీలు నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే వేల కోట్ల రూపాయల నగదు పట్టుబడుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 15 , 2024 | 02:13 PM