ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్‌కు అవమానం!

ABN, Publish Date - Aug 15 , 2024 | 12:48 PM

న్యూఢిల్లీలోని ఎర్రకోటపై 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ జెండాను ఎగురవేసిన విషయం తెలిసిందే. ఆసక్తికర విషయం ఏంటంటే.. దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా ఒక ప్రతిపక్ష నేత ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు రావడం.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఎర్రకోటపై 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ జెండాను ఎగురవేసిన విషయం తెలిసిందే. ఆసక్తికర విషయం ఏంటంటే.. దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా ఒక ప్రతిపక్ష నేత ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు రావడం ఇదే తొలిసారి. అయితే ఈ వేడుకల్లో రాహుల్‌కు అవమానం ఎదురైందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఆయన సీటును చివరి వరుసలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. రాహుల్ ఈ వేడుకకు వచ్చి చివరి వరుసలో ఒలింపిక్ పతక విజేతలతో కలిసి కూర్చున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాహుల్ తెల్లటి కుర్తా-పైజామా ధరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు హాజరయ్యారు. భారత హాకీ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ గుర్జంత్ సింగ్ పక్కన కూర్చున్నారు. ముందు వరుసలలో మను భాకర్, సరబ్ జోత్ సింగ్ వంటి ఒలింపిక్ పతక విజేతలు ఉన్నారు.


ఒలింపిక్-కాంస్య విజేత హాకీ జట్టు సభ్యులు, దాని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పీఆర్ శ్రీజేష్ కూడా రాహుల్ గాంధీ కంటే ముందు వరుసలో కూర్చున్నారు. ప్రోటోకాల్ ప్రకారం అయితే లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడికి, కేబినెట్ మంత్రికి సమానమైన ర్యాంక్ ఉన్నవారికి ఎల్లప్పుడూ ముందు వరుసలో సీటు కేటాయిస్తూ ఉంటారు. ముందు వరుసలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, అమిత్ షా, ఎస్ జైశంకర్ ఉన్నారు. దీంతో ప్రస్తుతం రాహుల్ గాంధీ సీటింగ్ ఏర్పాటు విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ శ్రేణులు అయితే తమ నేతను అవమానించారంటూ మండిపడుతున్నాయి. ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలు కేటాయించడంతో కాంగ్రెస్ ఎంపీని వెనక్కి మార్చాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం, సీటింగ్ ప్లాన్‌లను రూపొందించడం రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యత.


ప్రోటోకాల్ ప్రకారం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడికి మొదటి వరుసలో సీటు ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూ.. ఆ తరువాత బీజేపీ హయాంలోనూ.. అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సోనియా గాంధీకి ఎప్పుడూ మొదటి వరుసలో సీటు కేటాయించడం జరిగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి స్థానం 2014 నుంచి ఖాళీగానే ఉంది. ఎందుకంటే దిగువ సభ బలంలో పదో వంతు మెజారిటీని ఏ పార్టీ సాధించడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం చేసుకుంది. అంతకు ముందు ఎన్నికల్లో అంటే 2014, 2019 ఎన్నికలలో 543 మంది సభ్యుల సభ కాంగ్రెస్ వరుసగా 44, 52 స్థానాలను గెలుచుకుంది. దీంతో దశాబ్ధ కాలం పాటు ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి తగ్గలేదు. మొత్తానికి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. అయినా సరే.. రాహుల్ సీటును ఎన్డీఏ చివరి వరుసలో ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Aug 15 , 2024 | 01:04 PM

Advertising
Advertising
<