ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nyay Yatra paused: రాహుల్ యాత్రకు స్వల్ప విరామం..ఎందుకంటే..?

ABN, Publish Date - Feb 19 , 2024 | 08:42 PM

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో సోమవారంనాడు ప్రవేశించిన రాహుల్ గాంధీ "భారత్ జోడో న్యాయ్ యాత్ర''లో మంగళవారం ఉదయం స్పల్ప విరామం చోటుచేసుకోనుంది. తనపై దాఖలైన పరువునష్టం కేసులో సుల్తాన్‌పూర్‌లోని జిల్లా సివిల్ కోర్టు ముందు రాహుల్ గాంధీ ఈనెల 20న హాజరుకానుండటంతో ఈ విరామం తలెత్తింది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో సోమవారంనాడు ప్రవేశించిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) "భారత్ జోడో న్యాయ్ యాత్ర'' (Bharat Jodo Nyay Yatra)లో మంగళవారం ఉదయం స్పల్ప విరామం చోటుచేసుకోనుంది. తనపై దాఖలైన పరువునష్టం కేసులో సుల్తాన్‌పూర్‌లోని జిల్లా సివిల్ కోర్టు ముందు రాహుల్ గాంధీ ఈనెల 20న హాజరుకానుండటంతో ఈ విరామం తలెత్తింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఈ సమాచారాన్ని 'ఎక్స్' ఖాతాలో తెలియజేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర 37వ రోజుకు చేరుకుందని, మంగళవారం ఉదయం స్వల్ప విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అమేథిలోని ఫుర్సత్‌గంజ్ నుంచి తిరిగి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.


కేసు ఏమిటి?

రాహుల్ గాంధీ 2018లో బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కించపరచేలా వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో ఫిబ్రవరి 20న తమ ముందు హాజరుకావాలని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు రాహుల్‌కు ఆదేశాలిచ్చింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అప్పటి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ మిశ్రా ఫిర్యాదు చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా తాను ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని, అమిత్‌షాను ఒక హంతకుడంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు 33 ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా ఉన్న తనను ఎంతో బాధించాయని అన్నారు. దీనిపై తన లాయర్ ద్వారా కేసు వేసానని, ఐదేళ్లుగా కేసు నడుస్తోందని విజయ్ మిశ్రా చెప్పారు. కాగా, రాహుల్‌పై ఆరోపణలు రుజువైతే గరిష్ఠంగా ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష పడవచ్చని విజయ్ మిశ్రా తరఫు లాయర్ సంతోష్ కుమార్ పాండే తెలిపారు.

Updated Date - Feb 19 , 2024 | 08:42 PM

Advertising
Advertising