ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

ABN, Publish Date - Sep 15 , 2024 | 08:09 AM

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చలి వాతావరణం మొదలైనప్పటికీ ఇంకా వర్షాలు(heavy rainfall) మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో నేటితోపాటు వచ్చే మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Rains next 3 days in india

దేశంలో ఓ వైపు చలి మొదలైనా కూడా రుతుపవనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటికీ అనేక చోట్ల నిరంతరం వర్షాలు(heavy rainfall) కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే వారం పశ్చిమ, మధ్య భారతదేశంలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ పేర్కొంది.


ఈ ప్రాంతాల్లో

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు మధ్యప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌కు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోస్తా రాష్ట్రాలు, వాటి పరిసర ప్రాంతాల్లో కూడా సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో కూడా నేటితోపాటు వచ్చే మూడు రోజులు వానలు రానున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతోపాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, తూర్పు మధ్యప్రదేశ్, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఐఎండీ నేడు వర్ష సూచనలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పింది.


పలువురు మృతి

సెప్టెంబరు 20 నుంచి వాతావరణం మళ్లీ మారుతుందని, దీని తర్వాత కూడా వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదని వెదర్ రిపోర్ట్ అధికారులు అంటున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్‌ కుమావోన్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వివిధ ప్రదేశాలలో కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులతో సహా 478 రహదారులు మూసుకుపోయాయి.

రాకపోకల విషయంలో

స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం శనివారం ఉదయం వరకు 24 గంటల్లో కుమావోన్ ప్రాంతంలోని హల్ద్వానీలో 337, నైనిటాల్‌లో 248, చంపావత్‌లో 180, చోర్గాలియాలో 149, రుద్రాపూర్‌లో 127 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలలో వర్షం కురుస్తుండటంతో వాహనాల రాకపోకల విషయంలో మొత్తం 42 రోడ్లు మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి:

Neeraj Chopra: నీరజ్ చోప్రాకు మళ్లీ షాక్.. డైమండ్ లీగ్ టైటిల్ కొంచెంలో మిస్

‘ఎర్రమట్టి’తో చెక్‌ పెట్టాలని!


కార్లపై భారీ డిస్కౌంట్లు


Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read Latest National News and Telugu News

Updated Date - Sep 15 , 2024 | 08:12 AM

Advertising
Advertising