Rajkot Game Zone Fire: రాజ్‌కోట్ ప్రమాదంలో విస్తుగొల్పే విషయాలు.. ఒకటే ఎమర్జెన్సీ ఎక్జిట్, ఎన్వోసీ లేనేలేదు
ABN, Publish Date - May 26 , 2024 | 03:51 PM
గుజరాత్‌లోని రాజ్ కోట్ గేమింగ్ జోన్(Rajkot trp Game Zone Fire)లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలు సహా మృతుల సంఖ్య 33కి చేరింది.విషాద ఘటనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) స్పెషల్ బెంచ్ ఆదివారం ప్రత్యేకంగా విచారించింది. ఈ ఘటనలో విస్తుగొల్పే విషయాలు బయటపడుతున్నాయి. గేమింగ్ జోన్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా లేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
రాజ్‌కోట్: గుజరాత్‌లోని రాజ్ కోట్ గేమింగ్ జోన్(Rajkot trp Game Zone Fire)లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలు సహా మృతుల సంఖ్య 33కి చేరింది.విషాద ఘటనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) స్పెషల్ బెంచ్ ఆదివారం ప్రత్యేకంగా విచారించింది.
ఈ ఘటనలో విస్తుగొల్పే విషయాలు బయటపడుతున్నాయి. గేమింగ్ జోన్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా లేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు. పైగా ఆ జోన్ కు రాకపోకలకు ఒకే దారి ఉందని చెప్పారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించి ప్రజలు పెద్ద సంఖ్యలో ఎక్జిట్ నుంచి బయట పడాలని చూశారు.అప్పటికే ఎగ్జిట్ మూసుకుపోవడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.
ఘటనకు కారకులైన గేమింగ్ జోన్ ఓనర్, మేనేజర్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అగ్నిప్రమాదంలో మృతుల శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. కాగా బాధితుల బంధువుల నుంచి గుర్తింపు కోసం డీఎన్ఏ సేకరించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘటనాస్థలిని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రధాని మోదీ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వంరూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించింది.
షార్ట్ సర్య్క్యూటే ప్రమాదానికి కారణమా?
టీఆర్పీ అని పిలిచే గేమింగ్ జోన్ కేవలం రూ.99 టిక్కెట్‌లతో వారాంతపు తగ్గింపు ఆఫర్‌ని ప్రకటించింది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
అయితే విచారణ తరువాత మాత్రమే కచ్చితమైన కారణం తెలుస్తుందని చెబుతున్నారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో గుజరాత్‌లోని అన్ని గేమ్ జోన్‌లను తనిఖీ చేయాలని, ఫైర్ డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండా నడుస్తున్న వాటిని మూసివేయాలని డీజీపీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీల అగ్నిమాపక అధికారులతో సమన్వయంగా ఈ ప్రక్రియ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి అదనపు డీజీపీ సుభాష్ త్రివేది నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం ఘటనపై విచారణ జరిపి 72 గంటల్లో రిపోర్టును ఇవ్వాల్సి ఉంది.
Fire Accident: గేమ్‌జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
Read National News and Latest News here
Updated Date - May 26 , 2024 | 03:51 PM