ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Lalla: బాలరాముడికి వజ్ర కిరీటం.. అందజేసిన గుజరాత్ వ్యాపారి

ABN, Publish Date - Jan 23 , 2024 | 12:01 PM

అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. ఆ రాములోరికి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బహుమతులను అందజేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి వజ్రాలు పొదిగిన కిరీటాన్ని బహూకరించారు.

అయోధ్య: అయోధ్యలో బాల రాముడు (Ram Lalla) కొలువుదీరాడు. భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. రాములోరికి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బహుమతులను అందజేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి వజ్రాలు పొదిగిన కిరీటాన్ని బహూకరించారు. ఆ కిరీటం బంగారంతో తయారు చేశారు. అందులో ముత్యాలు, రత్నాలు, వజ్రాలను చేర్చారు. ఇవన్నీ చేర్చడంతో కిరీటం బరువు 6 కిలోలు అయ్యింది. కిరీటం విలువ రూ.11 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.

సూరత్‌కు చెందిన గ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ వజ్రాలు పొదిగిన కిరీటాన్ని బాలరాముడికి అందజేసింది. ప్రాణ ప్రతిష్ఠ కోసం ఆ కంపెనీ యజమానికి ముఖేశ్ పటేల్ కుటుంబంతో కలిసి అయోధ్య వచ్చారు. తనతో తీసుకొని వచ్చిన కిరీటాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు, ప్రధాన అర్చకులకు అందజేశారు. బాల రాముడి కిరీటం తయారీ కోసం ఈ నెల 5వ తేదీన తమ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులను అయోధ్య పంపించారు. విగ్రహ తల కొలతలు తీసుకున్నారు. దాంతో కిరీటాన్ని అత్యంత సుందరంగా రూపొందించారు. బాల రాముడికి ఇతర ఆభరణాలు కూడా ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 23 , 2024 | 12:01 PM

Advertising
Advertising