ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: బాలరాముడి ఫొటో విడుదల.. ఎలా ఉన్నారంటే..?

ABN, Publish Date - Jan 19 , 2024 | 07:41 AM

అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రామ్ లల్లా (బాలరాముడు) ప్రవేశించారు. రామ్ లల్లా ఐదేళ్ల బాలుడిగా దర్శనం ఇస్తారు. ఆ విగ్రహం ఎలా ఉండనుందో అనే సందేహాం ప్రతి ఒక్కరిలో నెలకొంది. బాల రాముడి విగ్రహ ఫొటోను ఓ జాతీయ వార్తా సంస్థ విడుదల చేసింది.

అయోధ్య: అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) గర్భగుడిలోకి రామ్ లల్లా (బాలరాముడు) ప్రవేశించారు. రామ్ లల్లా ఐదేళ్ల బాలుడిగా దర్శనం ఇస్తారు. ఆ విగ్రహం ఎలా ఉండనుందో అనే సందేహాం ప్రతి ఒక్కరిలో నెలకొంది. బాల రాముడి విగ్రహ ఫొటోను ఓ జాతీయ వార్తా సంస్థ విడుదల చేసింది. 51 అంగులాల పొడవు ఉన్న విగ్రహం పై భాగాన్ని తెల్లని వస్త్రంతో కప్పి ఉంచారు. ఆ విగ్రహం సుందరంగా కనిపించింది. బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చే సమయంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు రామ నామాన్ని స్మరించారు. రామ్ లల్లా విగ్రహాన్ని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ అందంగా తీర్చిదిద్దారు.

గురువారం ఉదయం రాముడి విగ్రహాన్ని పవిత్ర నదీ జలాలతో అభిషేకించారు. తర్వాత గణేశాంబికా పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యాహవచనం క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు డాక్టర్‌ అనిల్‌ మిశ్రా దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన బాల రాముడి విగ్రహానికి ఉన్న కళ్ల గంతలను విప్పుతారు. ప్రధాని మోదీ రామ్ లల్లాను దర్శించుకొని హారతి ఇస్తారని అయోధ్య ఆలయ వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 19 , 2024 | 01:38 PM

Advertising
Advertising