40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Mandir: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం.. జై శ్రీరాం అని నినాదాలు

ABN, Publish Date - Jan 22 , 2024 | 11:45 AM

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం విదేశాల్లో ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్దకు ప్రవాస భారతీయులు భారీగా చేరుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 Ram Mandir: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం.. జై శ్రీరాం అని నినాదాలు

అయోధ్య: అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం విదేశాల్లో ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసుకొని, దాని ముందు రాముడి భజన చేస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ( New Yorks Times Square) వద్దకు ప్రవాస భారతీయులు భారీగా చేరుకున్నారు. వారంతా సాంప్రదాయ దుస్తులను ధరించి వచ్చారు. ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి తరిస్తున్నారు. స్క్రీన్ మీద రాములోరిని చూసి భజన చేస్తున్నారు. మరికొందరు పాటలు పాడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి, ఐక్యతను ప్రదర్శించారు. టైమ్స్ స్క్వేర్ స్క్రీన్ మీద రాముడి ప్రతిరూపం చూసి అక్కడున్న భారతీయులు మురిసిపోతున్నారు. కాషాయ రంగు జెండాలను పట్టుకొని జై శ్రీరామ్ అని గట్టిగా నినాదాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. ప్రాణ ప్రతిష్ఠకు 7 వేల మంది అతిథులు హాజరయినట్టు తెలుస్తోంది. ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 22 , 2024 | 11:53 AM

Advertising
Advertising