ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jharkhand: మంత్రిగా రామదాస్ ప్రమాణం

ABN, Publish Date - Aug 30 , 2024 | 12:18 PM

జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ కేబినెట్‌లో మంత్రిగా రామదాస్ సోరెన్ శుక్రవాం ప్రమణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో రామదాస్ సోరెన్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం హేమంత్ సోరెన్‌తోపాటు ఇతర కేబినెట్‌ మంత్రులు హాజరయ్యారు.

రాంచీ, ఆగస్ట్ 30: జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ కేబినెట్‌లో మంత్రిగా రామదాస్ సోరెన్ శుక్రవారం ప్రమణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో రామదాస్ సోరెన్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం హేమంత్ సోరెన్‌తోపాటు ఇతర కేబినెట్‌ మంత్రులు హాజరయ్యారు. సోరెన్ కేబినెట్‌లోని మంత్రి చంపయి సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో రామదాస్ సోరెన్‌ను తీసుకున్నారు. సింగ్‌భమ్ జిల్లాలోని ఘట్‌శిల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రామదాస్ సోరెన్ ఎన్నికయ్యారు. 2009, 2019లో ఆయన జేఎంఎం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం జంషెడ్‌పూర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం చంపయి సోరెన్ బీజేపీలో చేరనున్నారు.

Also Read: Ram Chander: కలలో కనిపించి మందలించిన సీఎం

Also Read: Sri Lanka: దేశాధ్యక్షుడి ఎన్నికల వేళ.. కొలంబోకు అజిత్ దోవల్


భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఏడాది జనవరిలో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ .. తన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2వ తేదీన జార్ఖండ్ సీఎంగా చంపయి సోరెన్ బాధ్యతలు చేపట్టారు. ఈ కేసులో జులై తొలి వారంలో హేమంత్ సోరెన్‌కు బెయిల్‌ లభించింది. దాంతో ఆయన జైలు నుంచి బయటకు రావడంతో.. సీఎం పదవికి చంపయి సోరెన్ రాజీనామా చేయడం అనివార్యమైంది.

Also Read: Maharashtra: శివాజీ విగ్రహం కూలిన ఘటనలో పాటిల్ అరెస్ట్


ఆ క్రమంలో జులై 3న చంపయి సోరెన్ సీఎం పదవికీ రాజీనామా చేశారు. జులై 4వ తేదీన సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టారు. ఇక హేమంత్ కేబినెట్‌లో మంత్రిగా చంపయి సోరెన్‌ను తీసుకున్నారు. అనంతరం ఆయన మంత్రి పదవితోపాటు పార్టీకి సైతం రాజీనామా చేశారు. ఇటీవల న్యూడిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి.. పార్టీలో చేరేందుకు చంపయి సోరెన్ సుముఖత వ్యక్తం చేశారు.

Also Read: Kolkata Doctor Murder Case: వైద్యురాలి తల్లిదండ్రులకు అర గంటలో మూడు ఫోన్ కాల్స్..


ఈ నేపథ్యంలో ఆగస్ట్ 30వ తేదీ మధ్యాహ్నం చంపయి సోరెన్ బీజేపీలో చేరుతున్నారు. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) పోటీ చేయనుంది. అలాగే ఇండియా కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి.

Also Read: Manipur: ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్లు చోరీ.. ఐదుగురు అరెస్ట్


ఇంకోవైపు జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందుకే అధికార జార్ఖండ్ ముక్తి మోర్చ నాయకుడు, మాజీ సీఎం చంపయి సోరెన్‌ పార్టీకీ రాజీనామా చేసి.. బీజేపీలో చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 01:21 PM

Advertising
Advertising