ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UPSC aspirants deaths: ఎట్టకేలకు పెదవివిప్పిన రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్

ABN, Publish Date - Jul 31 , 2024 | 07:03 PM

బిల్డింగ్ బేస్‌మెంట్‌లో వరదు నీరు ముంచెత్తి ముగ్గురు ఐఏఎస్ ఆశావహులు మృతి చెందిన కేసులో పోలీసు విచారణను ఎదుర్కొంటున్న రావూస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్ ఎట్టకేలకు బుధవారంనాడు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్పందించింది. తమ ముగ్గురు స్టూడెంట్ల మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: బిల్డింగ్ బేస్‌మెంట్‌లో వరదు నీరు ముంచెత్తి ముగ్గురు ఐఏఎస్ ఆశావహులు మృతి చెందిన కేసులో పోలీసు విచారణను ఎదుర్కొంటున్న రావూస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్ (Rau's IAS Study Circle) ఎట్టకేలకు బుధవారంనాడు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్పందించింది. తమ ముగ్గురు స్టూడెంట్ల మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.


''ఈనెల 27న జరిగి విషాద ఘటనలో మా విద్యార్థులు తానియా సోని, నివిన్ డాల్విన్, శ్రేయ యాదవ్ ప్రాణాలు కోల్పోవడం మమ్మల్ని విచారంలో ముంచెత్తింది. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ ఘటనపై ప్రస్తుతం జరుగుతున్న విచారణకు మేము పూర్తిగా సహకరిస్తాం. ఇలాంటి క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. వారి కలలు, అంకితభావం ఎప్పుటికీ గుర్తిండిపోతాయి'' అని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ 'ఎక్స్' పోస్టులో పేర్కొంది.

Puja Khedkar: పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్‌సీ


బెయిలు నిరాకరణ...

కాగా, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బేస్‌మెంట్ యజమానులైన పర్వీందర్ సింగ్, సర్వజిత్ సింగ్, హర్వీందర్ సింగ్, తేజేందర్ సింగ్‌లకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ తీజ్ హజారీ కోర్టు నిరాకరించింది. ఓల్డ్ రాజేందర్ నగర్‌ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో విద్యార్థుల మృతి ఘటనలో వీరు నిందితులుగా ఉన్నారు. కారు ఓనర్ మనోజ్ కథురియా బెయిల్ అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని వరద నీటిలో కథూరియా తన సువ్ కారును నడపడంతో ఆ నీరు గేట్లను తోసుకుంటూ బేస్‌మెంట్‌ను ముంచెత్తింది. ఈ ఘటనలో ఢిల్లీ పోలీసులు రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఓనర్, కోఆర్డినేటర్ సహా ఏడుగురిని అరెస్టు చేసింది. పార్లమెంటునును సైతం ఈ ఘటన కుదిపేసింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 07:03 PM

Advertising
Advertising
<