ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National Commission for Women: చైర్మన్ పదవికి రేఖా శర్మ రాజీనామా

ABN, Publish Date - Aug 07 , 2024 | 08:34 AM

2015, ఆగస్ట్‌లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా రేఖా శర్మ నియమితులయ్యారు. అనంతరం 2017, సెప్టెంబర్ 29న కమిషన్ చైర్ పర్సన్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. నాటి నుంచి మంగళవారం వరకు ఆమె.. ఈ చైర్ పర్సన్ పదవిలో కొనసాగారు.

NCW chairperson Rekha Sharma

న్యూఢిల్లీ, ఆగస్ట్ 07: జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) చైర్మన్ పదవికి రేఖా శర్మ(Rekha Sharma) రాజీనామా చేశారు. నిన్నటితో ఆమె పదవి కాలం పూర్తయింది. దీంతో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తొమ్మిదేళ్ల పాటు జాతీయ మహిళా కమిషన్‌లో రేఖా శర్మ పని చేశారు. చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వేళ.. రేఖా శర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. జాతీయ మహిళా కమిషన్‌లో తన తొమ్మిదేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఈ రోజే చివరి రోజు అని పేర్కొన్నారు. ఈ కాలంలో తాను ఎత్తు పల్లాలను చూశానని తెలిపారు. జాతీయ మహిళా కమిషన్‌లో పని చేయడం వల్ల చాలా అంశాలను నేర్చుకున్నానని వివరించారు.

Also Read: Gold Rates: శ్రావణమాసం వేళ.. భారీగా తగ్గిన పసిడి ధరలు..


చెరగని ముద్ర..

జాతీయ మహిళా కమిషన్‌లో పని చేస్తూ... ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయాలు, సాధించిన విజయాల గురించే కాదని.. దేశవ్యాప్తంగా మహిళల ప్రేమాభిమానాలను సైతం తాను పొందానన్నారు. ఈ పదవి కాలంలో ఉండగా.. ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. అదే విధంగా జైళ్లలో ఉన్న వేలాది మంది మహిళలు.. తమ జీవితా గాధలను తనతో పంచుకోనే అవకాశం కలిగిందని వివరించారు. అవి తన మనస్సుపై చెరగని ముద్రను వేశాయని పేర్కొన్నారు.


సోషల్ మీడియాలో...

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన విమర్శలు ఎదుర్కొవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సానుకూల దృక్పథంతో ముందుకు కొనసాగానన్నారు. తాను ఇలా అనుభవాలతోపాటు పాఠాల నేర్చుకునేందుకు అవకాశం కలిగిందని వివరించారు. సోషల్ మీడియా ఇచ్చిన స్వేచ్చ ద్వారా నిజం తెలుసుకునే అవకాశం లేకపోయిందని వాపోయారు. ఆ అంశానికి తాను బాధ పడటం లేదని.. కృతజ్ఞత భావం మాత్రమే ఉందని స్పష్టం చేశారు.


తొలుత సభ్యురాలిగా చేరి.. అనంతరం..

2015, ఆగస్ట్‌లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా రేఖా శర్మ నియమితులయ్యారు. అనంతరం 2017, సెప్టెంబర్ 29న కమిషన్ చైర్ పర్సన్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. నాటి నుంచి మంగళవారం వరకు చైర్ పర్సన్ పదవిలో కొనసాగారు.


రేఖా శర్మ పదవిలో ఉన్న సమయంలో దేశంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. మణిపూర్‌, పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై దాడులు జరిగాయి. ఆ సమయంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించిన దాఖలాలు లేవని ఆరోపణలు వచ్చాయి. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎలాంటి ఘటనలు జరిగినా.. ఎలాంటి చర్యలు తీసుకోరనే తీవ్ర ఆరోపణలను రేఖా శర్మ ఎదుర్కొన్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 07 , 2024 | 12:01 PM

Advertising
Advertising
<