ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mumbai: నటుడు రవికిషన్‌కు ఉపశమనం, షినోవా పిటిషన్‌ను కోర్టు తిరస్కరణ..

ABN, Publish Date - Apr 27 , 2024 | 03:35 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానం అభ్యర్థి, నటుడు రవికిషన్‌ని తన తండ్రిగా పేర్కొంటూ ఆయనకు డీఎన్‌ఏ టెస్ట్‌ నిర్వహించాలని షినోవా(25) అనే యువతి వేసిన పిటిషన్‌ను ముంబై కోర్టు శుక్రవారం తిరస్కరించింది.

ముంబై, ఏప్రిల్‌ 26: ముంబైలో దిండోషి సెషన్స్‌ కోర్టు ఈ పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత ఆమె తల్లి అపర్ణ సోనికి రవికిషన్‌కు మధ్య అనుబంధం ఉన్నట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని పేర్కొంది. కాగా ఏప్రిల్‌ 16న లక్‌నవూలో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అపర్ణ సోని మాట్లాడుతూ... రవికిషనే షినోవా తండ్రి అని, ఆయన కుమార్తెగా ఆమెకున్న హక్కులను నిరాకరిస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు రవికిషన్‌ భార్య ప్రీతి శుక్లా... అపర్ణ, షినోవా, మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపర్ణ తనకు అండర్‌ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని తనను బెదిరించారని ఆరోపించారు. దీంతో పోలీసులు అపర్ణ సోని, ఆమె భర్త రాజేష్‌ సోని, కుమార్తె షినోవా, కుమారుడు సౌనక్‌ సోని, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు వివేక్‌ కుమార్‌ పాండే, ఖుర్షీద్‌ ఖాన్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 27 , 2024 | 03:35 AM

Advertising
Advertising