ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Robert Vadra: రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు

ABN, Publish Date - Jun 24 , 2024 | 05:15 PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోమవారం న్యూడిల్లీలో ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతిపక్ష పార్టీల బాధ్యతను రాహుల్ గాంధీ బాగా అర్థం చేసుకున్నారన్నారు. ఆ క్రమంలో అధికార బీజేపీకి రాహుల్ ప్రతి విషయంలో సవాల్ విసురుతారని రాబర్ట్ వాద్రా ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ, జూన్ 24: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోమవారం న్యూడిల్లీలో ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతిపక్ష పార్టీల బాధ్యతను రాహుల్ గాంధీ బాగా అర్థం చేసుకున్నారన్నారు. ఆ క్రమంలో అధికార బీజేపీకి రాహుల్ ప్రతి విషయంలో సవాల్ విసురుతారని రాబర్ట్ వాద్రా ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు సోదర సమానుడైన రాహుల్ గాంధీ ఎలాంటి వాడన్నది తనకు బాగా తెలుసునన్నారు. అలాగే రాహుల్ గాంధీ ఏ పని చేసినా మనస్సు పెట్టి పని చేస్తాడని తెలిపారు. ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ తన బాధ్యతను అర్థం చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

Also Read: Jagtial Politics: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం..!


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. దీంతో లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. కానీ ఆ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ససేమిరా అన్నారు. ఆ క్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో కీలక చర్చ అయితే వాడి వేడిగా జరుగుతుంది.

Also Read: Delhi Liquor Scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు


మరోవైపు కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో ఆ లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. ఇక వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ తాజాగా బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తన సోదరి ప్రియాంక గాంధీని భారీ మెజార్టీతో గెలిపించాలని వయనాడ్ ప్రజలకు ఆయన విజ్జప్తి చేశారు. అలాగే తాను చేయాలనుకున్న అభివృద్ధి పనులు.. ప్రియాంకా గాంధీ చేస్తుందంటూ వయనాడ్ ప్రజలకు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వివరించిన విషయం విధితమే.


ఇంకోవైపు 18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సభలో మాట్లాడుతూ.. గతంలో ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి రేపటికి 50 ఏళ్లు అవుతుందంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై విపక్ష ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతులను పట్టుకొని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

For Latest News and National News click here

Updated Date - Jun 24 , 2024 | 05:15 PM

Advertising
Advertising