ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Incometax Raids:72 గంటలు తనిఖీలు: రూ.170 కోట్లు సీజ్

ABN, Publish Date - May 16 , 2024 | 03:02 PM

మహారాష్ట్రలోని నాందేడ్‌లో బండారీ ఫైన్సాన్స్, అదీనాథ్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.170 కోట్ల విలువైన సంపదను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు.

నాందేడ్, మే 16: మహారాష్ట్రలోని నాందేడ్‌లో బండారీ ఫైన్సాన్స్, అదీనాథ్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.170 కోట్ల విలువైన సంపదను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. అందులో రూ. 14 కోట్లతోపాటు 8 కేజీల బంగారు కూడా ఉంది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం వెల్లడించారు.

National Commission for Women: బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ

నాందేడ్‌లో బండారీ ఫైనాన్స్, అదీనాథ్ అర్బన్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్‌‌.. భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించామని వివరించారు. ఆ క్రమంలో స్థానిక ఆలీబాయ్ టవర్స్‌లోని బండారీ ఫైన్సాన్స్ కార్యాలయం, అదీనాథ్ అర్బన్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్, కోకాటే కాంప్లెక్స్‌లోని మూడు కార్యాలయాలు, కోఠారీ కాంప్లెక్స్‌‌లోని కార్యాలయంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్పారు.


అయితే నాందేడ్‌లో ఇంత మొత్తంలో నగదు సీజ్ చేయడం ఇదే తొలిసారని వారు తెలిపారు. అలాగే పన్ను ఎగవేత కేసులో అందుకు సంబంధించిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. మే 10 తేదీ నుంచి మే 12వ తేదీ వరకు నిర్వహించిన ఈ తనిఖీలు మొత్తం 25 మంది ఉన్నతాధికారులు పాల్గొన్నరన్నారు.

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

నాందేడ్‌లో వ్యక్తిగత రుణాలు ఇచ్చే వ్యాపారాన్ని బండారీ సోదరులు గతంలో ప్రారంభించారని... ఆ క్రమంలో ఈ రుణాలు భారీగా మంజూరు చేసినట్లు తమకు సమాచారం అందిందని.. దీంతో ఈ దాడులు నిర్వహించినట్లు వివరించారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 16 , 2024 | 03:02 PM

Advertising
Advertising