ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RSS Mohan Bhagwat : నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు

ABN, Publish Date - Jun 12 , 2024 | 04:35 AM

కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తరుణంలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన పలు హితవచనాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రజాసేవలో

నేనే చేశానని చెప్పుకోడు

ప్రజా జీవితంలో మర్యాదలు పాటిస్తాడు

రాజకీయాల్లో విపక్షాలే తప్ప విరోధి పక్షాలు ఉండవు: మోహన్‌ భాగవత్‌

నాగ్‌పూర్‌, జూన్‌ 11: కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తరుణంలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన పలు హితవచనాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రజాసేవలో నాయకులు వ్యవహరించాల్సిన తీరును, ఎన్నికల ప్రచారంలో పాటించాల్సిన హుందాతనాన్ని ఆయన గుర్తుచేశారు. అల్లర్లతో అతలాకుతలమవుతున్న మణిపూర్‌ సమస్యను తొలుత పరిష్కరించాలని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశారు. అహంకార రహితంగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఉద్బోధించారు. నిజమైన సేవకునికి అహంకారం ఉండదని, ప్రజాజీవితంలో గౌరవ మర్యాదలు పాటిస్తాడని అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సోమవారం ఆరెస్సెస్‌ ట్రైనీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇటీవలి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మర్యాదలు పాటించలేదని చెబుతూ నిజమైన సేవకుని లక్షణాలను వివరించారు. ఎన్నికలంటే పోటీయే తప్ప యుద్ధం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. రాజకీయాల్లో ‘ప్రతి పక్షమే’ తప్ప ‘విరోధి పక్షం’ ఉండదని, అందుకు అనుగుణంగానే పార్టీల వ్యవహార శైలి ఉండాలని చెప్పారు. ‘‘ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు అత్యవసరం. రాజకీయ పార్టీల మధ్య పోటీ కూడా ఉంటుంది. పోటీ అంటే ఒకరు ముందుకు వెళ్లడం, మరొకర్ని వెనక్కి లాగడం. ఇదే చేయొద్దు. ప్రజలు ప్రతినిధులను ఎందుకు ఎన్నుకుంటారు? పార్లమెంటులో కూర్చొని ఏకాభిప్రాయం సాధించి దేశాన్ని నడిపిస్తారని...ఏకాభిప్రాయ సాధనే మన సంప్రదాయం. పార్లమెంటుకు వచ్చిన రెండు పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కొంత కష్టమే. అందుకే మెజార్టీని పరిగణనలోకి తీసుకుంటారు. పార్టీల మధ్య పోటీ ఉంటుందే తప్ప పరస్పర యుద్ధం కాద’’ని అన్నారు. అందువల్ల ఇరు పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత చర్చలు జరిపి అంగీకారానికి రావాల్సి ఉంటుందని చెప్పారు. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో అదుపుతప్పి విమర్శలు చేసుకున్న వైనాన్ని మోహన్‌ భాగవత్‌ ప్రస్తావించారు.

దీంట్లోకి ఆరెస్సె్‌సను కూడా లాగారని విచారం వ్యక్తం చేశారు. ‘‘ఒకరిని మరొకరు విమర్శించుకున్న తీరు..ప్రచారంలో వ్యవహరించిన విధానం..సమాజంలో విభేదాలను పెంచుతాయి. సమాజాన్ని రెండు వర్గాలుగా చీల్చుతాయి. పరస్పరం అవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంట్లోకి సంఘ్‌ను కూడా లాగారు. సాంకేతికతను దుర్వినియోగం చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. మొత్తం అబద్ధాలనే చెప్పారు. గౌరవనీయ వ్యక్తులెవరూ ఇలాంటి సాంకేతికను ఉపయోగించరు. ఎన్నికల్లో గౌరవ మర్యాదలు పాటించాలి. దేశ సమస్యలు ఇంకా తీరలేదు కాబట్టి మర్యాదలతో మెగలడం తప్పనిసరి’’ అని అన్నారు. ఎన్నికల వాతావరణం నుంచి బయటపడి దేశ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని భాగవత్‌ హితవు చెప్పారు. అత్యంత ప్రాధాన్యమున్న అంశంగా మణిపూర్‌ అల్లర్లను గుర్తించాలని సూచించారు. ‘‘ఏడాది కాలంగా మణిపూర్‌ శాంతి కోసం ఎదురు చూస్తోంది. గత పదేళ్లుగా ఆ రాష్ట్రంలో శాంతి నెలకొంది. కానీ ఆకస్మికంగా తుపాకీ సంస్కృతి మళ్లీ పెరిగింది. అది ఇంకా మంటల్లో కాలుతునే ఉంది. ఎవరు దీనిపై దృష్టి పెడుతారు? దీన్ని ప్రాధాన్యమైన సమస్యగా గుర్తించి చర్చించాలి. దీన్ని కర్తవ్యంగా భావించాలి’’ అని తెలిపారు. మోదీ ప్రభుత్వం చాలా రంగాల్లో విశేష ప్రగతి సాధించిందని ప్రశంసిస్తూనే దేశం ఇంకా సవాళ్ల నుంచి విముక్తి పొందలేదని వ్యాఖ్యానించారు.


సలహాలను మోదీ పాటించాలి: విపక్షాలు

భాగవత్‌ ప్రసంగంపై కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు స్పందించాయి. ఆయన సలహాలను పాటించాలని ప్రధాని మోదీకి సూచించాయి. ఇప్పటికైనా మణిపూర్‌ వెళ్లి పరిస్థితులను చక్కదిద్దాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ప్రధానిని ఉద్దేశించి అన్నారు. అసలు సలహాలు వినడం మోదీ డీఎన్‌ఏలోనే లేదని రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల మాటలు వినకపోయినా, కనీసం ఆరెస్సెస్‌ చీఫ్‌ సూచనలైనా పట్టించుకోవాలని అన్నారు. ఛత్తీ్‌సగఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘేల్‌ మాట్లాడుతూ ‘విస్పష్టంగా కనిపిస్తున్న అహంకారం గురించి భాగవత్‌ అనుభవపూర్వకంగా చెప్పినట్టుంద’ని వ్యాఖ్యానించారు. ఇంతజరుగుతున్నా మణిపూర్‌పై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ఎన్‌సీపీ (పవార్‌) నాయకురాలు సుప్రియా సూలే విమర్శించారు.

Updated Date - Jun 12 , 2024 | 04:36 AM

Advertising
Advertising