ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: రస్కిన్‌ బాండ్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రదానం

ABN, Publish Date - May 12 , 2024 | 03:31 AM

ప్రముఖ ఆంగ్ల రచయిత రస్కిన్‌ బాండ్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషి్‌పను ప్రదానం చేసిం ది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్య క్షుడు మాధవ్‌ కౌశిక్‌, కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు శనివారం ముస్సోరిలో రస్కిన్‌ బాండ్‌ నివాసానికి వెళ్లి ఈ ఫెలోషి్‌పను అందజేశారు.

న్యూఢిల్లీ, మే11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆంగ్ల రచయిత రస్కిన్‌ బాండ్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషి్‌పను ప్రదానం చేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్య క్షుడు మాధవ్‌ కౌశిక్‌, కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు శనివారం ముస్సోరిలో రస్కిన్‌ బాండ్‌ నివాసానికి వెళ్లి ఈ ఫెలోషి్‌పను అందజేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీలో 1934 మేలో జన్మించిన రస్కిన్‌ బాండ్‌ గత 50ఏళ్లుగా సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. పలు కథా సంకలనాలు, వ్యాసాలు, పిల్లల పుస్తకాలు రచించారు. వాగ్రంట్స్‌ ఇన్‌ ద వ్యాలీ, వన్స్‌ అపాన్‌ ఎ మాన్‌సూన్‌ టైమ్‌, యాంగ్రీ రివర్‌, స్ర్టేంజర్స్‌ ఇన్‌ ద నైట్‌, ఆల్‌ రోడ్స్‌ లీడ్స్‌గంగా మొదలైనవి ఆయన ప్రముఖ రచనలు.


1857సిపాయిల తిరుగుబాటుపై ఆయన రచించిన నవల ఆధారంగా జూనూన్‌ అనే చలన చిత్రం రూపొందించారు. ఆయన రచనలపై అనేక టీవీ సీరియల్స్‌ వచ్చాయి. ఆయన కథా సంకలనానికి 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. అకాడమీ బాలసాహిత్య పురస్కారం, పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు ఆయనకు దక్కాయి. ఇటీవల జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారానికి కూడా ఆయన పేరును పరిశీలించారు.

Updated Date - May 12 , 2024 | 03:31 AM

Advertising
Advertising