Russia: అణ్వాయుధాలను పరీక్షించి సిద్ధం చేయండి..
ABN, Publish Date - May 07 , 2024 | 04:22 AM
ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో నాటో దేశాలు తమను రెచ్చగొడితే అణ్వాయుధాలను వాడటానికి కూడా వెనుకాడబోమన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దిశగా ఓ అడుగు ముందుకేశారు.
అధికారులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు
న్యూఢిల్లీ, మే 6: ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో నాటో దేశాలు తమను రెచ్చగొడితే అణ్వాయుధాలను వాడటానికి కూడా వెనుకాడబోమన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దిశగా ఓ అడుగు ముందుకేశారు. అణ్వాయుధాలను పరీక్షించి, సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రష్యాలో అణ్వాయుధ పరీక్షలు సాధారణమే అ యినప్పటికీ, రష్యా ఇలా బహిరంగంగా ప్రకటన చేయడం ఇదేమొదటిసారి.
అవసరమైతే ఉక్రెయిన్‌కు తమ బలగాలను పంపిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఉక్రెయిన్ తమ ఆయుధాలను వినియోగించుకోవచ్చని యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో పుతిన్.. పశ్చిమ దేశాలను హెచ్చరించడానికే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - May 07 , 2024 | 04:22 AM