శబరిమలలో పంపా నుంచి సన్నిధి వరకు సీసీ కెమెరాలు
ABN, Publish Date - Dec 09 , 2024 | 04:21 AM
శబరిమలలో మొట్టమొదటి సారిగా.. పంపా బేస్ క్యాంప్ నుంచి సన్నిధానం వరకు ప్రతి అంగుళం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
శబరిమల, డిసెంబరు 8: శబరిమలలో మొట్టమొదటి సారిగా.. పంపా బేస్ క్యాంప్ నుంచి సన్నిధానం వరకు ప్రతి అంగుళం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పంపా నుంచి శరణ్‌గుత్తి వరకు రెండువైపులా మార్గాలతోపాటు.. నడపండల్, పదునెట్టాంబడి, సన్నిధానం, భస్మకులం ప్రాంతాల్లో మొత్తం 258 హెచ్‌డీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీటిని రేయింబవళ్లు పర్యవేక్షించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
Updated Date - Dec 09 , 2024 | 04:21 AM