ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: అయోధ్యలో సచిన్, అంబానీ కుటుంబం సందడి.. ఇంకా ఎవరెవరంటే..?

ABN, Publish Date - Jan 22 , 2024 | 12:37 PM

రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానం అందిన ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శ్రీరాముడి జన్మభూమి ఆలయం అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సచిన్ హాజరయ్యారు.

అయోధ్య: రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానం అందిన ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శ్రీరాముడి జన్మభూమి ఆలయం అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సచిన్ హాజరయ్యారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ, సతీమణి నితా అంబానీతో కలిసి అయోధ్యలో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ఈ రోజు రాముడు వస్తున్నాడని, జనవరి 22 దేశం మొత్తానికి రామ్ దీపావళి అని పేర్కొన్నారు. అలాగే ఇది చరిత్రాత్మకమమైన రోజు అని నీతా అంబానీ చెప్పారు. ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, ఆమె భర్త ఆనంద్‌తో కలిసి అయోధ్యకు చేరుకున్నారు. "ఈ రోజు మనకు అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను." అని ఇషా అంబానీ అన్నారు.


అలాగే మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, టాలీవుడ్ ప్రముఖ నటులు చిరంజీవి, రామ్ చరణ్, తమిళ ప్రముఖ నటుడు రజనీకాంత్ తదితరులు అయోధ్యకు చేరుకున్నారు. ఒక వైపు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ మరోవైపు ప్రముఖుల రాకతో అయోధ్యలో సందడి వాతావరణం నెలకొంది. అయోధ్యలోని ఇతరత్రా ఆలయాలను కూడా ప్రముఖులు దర్శించుకుంటున్నారు. అలాగే రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పొటెత్తారు. సీతారాములకు పూజలు చేస్తున్నారు. కాగా అయోధ్య ప్రాణప్రతిష్ఠ దివ్య ముహూర్తం 84 సెకండ్లపాటు కొనసాగనుంది. మధ్యాహ్నం 12:29:03 గంటల నుంచి 12:30:35 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2024 | 12:37 PM

Advertising
Advertising