ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sukhbir Singh Badal: హత్యాయత్నం జరిగినా చలించని సుఖ్‌బీర్.. ఆ తర్వాత ఏమి చేశారంటే

ABN, Publish Date - Dec 04 , 2024 | 03:23 PM

007-2017 మధ్య శిరోమణి అకాలీ దళ్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన తప్పునకు శిక్షగా సుఖ్‌బీర్‌కు మత పెద్దలు తంఖా (మతపరమైన శిక్ష) విధించారు. దీంతో ఆయన శిక్షకు సంబంధించిన ఫలకను మెడలో వేసుకుని, వీల్‌చైర్‌పై సేవాదార్‌గా మంగళవారం నుంచి సేవ కొనసాగిస్తున్నారు.

అమృత్‌సర్: అకల్‌ తఖ్త్ శిక్షలో భాగంగా స్వర్ణదేవాలయంలోని వంట పాత్రలను శిరోమణి అకాలీ దళ్ నేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal) బుధవారంనాడు శుభ్రం చేశారు. దీనికి కొద్ది నిమిషాలకు ముందే ఆలయం ప్రవేశద్వారం వద్ద ఆయనపై ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. సకాలంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకోవడంతో సుఖ్‌బీర్‌కు ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటన అనంతరం కూడా ఆయన చలించకుండా స్వర్ణ దేవాలయంలోని వంట పాత్రలను శుభ్రం చేశారు. కాలుకు దెబ్బ కారణంగా వీల్‌ చైర్‌లోనే ఆయన తన డ్యూటీని పూర్తి చేశారు.

Sukhbir Singh Badal: సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపిందెవరంటే


దాడి అనంతరం కూడా సుఖ్‌బీర్ తనకు విధించిన "సేవ"ను కొనసాగించినట్టు సాద్ నేత బల్వీందర్ సింగ్ భుందెర్ తెలిపారు. ''ఇది వాహె గురు (సర్వ శక్తివంతుడైన భగవంతుని పేరు) ప్లేస్. ఆయనే మమ్మల్ని రక్షిస్తున్నారు. సేవ కొనసాగుతుంది. మేము ఆల్‌మైటీని విశ్వసిస్తున్నాం'' అని అన్నారు.


గోడకు తగిలిన బుల్లెట్

2007-2017 మధ్య శిరోమణి అకాలీ దళ్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన తప్పునకు శిక్షగా సుఖ్‌బీర్‌కు మత పెద్దలు తంఖా (మతపరమైన శిక్ష) విధించారు. దీంతో ఆయన శిక్షకు సంబంధించిన ఫలకను మెడలో వేసుకుని, వీల్‌చైర్‌పై సేవాదార్‌గా మంగళవారం నుంచి సేవ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారంనాడు ఆయనకు సమీపానికి వచ్చిన ఒక వృద్ధుడు కాల్పులు జరపడంతో అక్కడే ఉన్న వ్యక్తిగత సిబ్బంది ఆయన చేతిని పట్టుకుని పక్కకు లాక్కెళ్లడంతో ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన వ్యక్తిని వేరాటువాద ఖలిస్తాన్ ఉద్యమ మాజీ మిలిటెంట్ నారాయణ్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతను పేల్చిన బుల్లెట్ సుఖ్‌బీర్ వెనుక ఉన్న గోడకు తగలడంతో ప్రమాదం తప్పింది.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఆ గంగాజలం స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదు: పీసీబీ

Rahul Gandhi: ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Dec 04 , 2024 | 03:23 PM