Bangladesh Violence: భారత్‌లోని బంగ్లాదేశీ విద్యార్థుల్లో ‘ఆందోళన’
ABN, Publish Date - Aug 08 , 2024 | 10:20 AM
బంగ్లాదేశ్‌లో తమ కుటుంబం గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుందన్నారు. కానీ ఈ సమయంలో వాళ్లను తాను చేరుకోలేనని చెప్పారు. ఇది తనను ఒకింత ఆందోళన కలిగించే పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమకు ఏఎంయూ ప్రొఫెసర్ల మద్దతు ఉందన్నారు. అలాగే భారతీయ విద్యార్థులు సైతం తమ పట్ల ఓదార్పుతో వ్యవహరిస్తున్నారని ఆమె వివరించారు.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 08: బంగ్లాదేశ్‌లో వరుస ఆందోళనలతో అట్టుడికిపోతుంది. అలాంటి వేళ.. అక్కడ తమ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారోనని అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లోని బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై వారు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్కర సమయంలో.. తమ తమ కుటుంబాలు సురక్షితంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. అయితే ఇండియాలో తామంతా సురక్షితంగానే ఉన్నామని చెప్పారు.
Also Read: Vinesh Phogat: ‘నాపై కుస్తీ గెలిచింది.. నేను ఓడిపోయాను’
పాయల్ స్పందిస్తూ...
అలీగడ్ ముస్లిం యూనివర్సిటీలోని పీహెచ్‌డీ విద్యార్థి పాయల్ రాయ్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో తమ కుటుంబం గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుందన్నారు. కానీ ఈ సమయంలో వాళ్లను తాను చేరుకోలేనని చెప్పారు. ఇది తనను ఒకింత ఆందోళన కలిగించే పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమకు ఏఎంయూ ప్రొఫెసర్ల మద్దతు ఉందన్నారు. అలాగే భారతీయ విద్యార్థులు సైతం తమ పట్ల ఓదార్పుతో వ్యవహరిస్తున్నారని ఆమె వివరించారు. బంగ్లాదేశ్ క్లిష్ట సమయం ఉందన్నారు.
Also Read: Viral: గర్ల్ ఫ్రెండ్ కోసం.. ఓ టీనేజర్ ఘనకార్యం
ప్రధాని మోదీకి ధన్యవాదాలు...
అలాంటి వేళ.. తమ దేశ ప్రజలకు మద్దతుగా ప్రధాని మోదీ నిలబడ్డారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో భారత్ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో భారత ప్రభుత్వంపై కొంత మంది విమర్శలు గుప్పించడం చూసి నిరాశ పడతామన్నారు.
పాకిస్థానే కారణం...
ఇక హిందుస్థాని బిర్దారి వైస్ చైర్మన్ విశాల్ శర్మ మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో అశాంతికి కారణం పాకిస్థానేనని ఆరోపించారు. పాకిస్థాన్ ముస్లింలు మెజార్టీగా ఉన్న దేశమని ఈ సందర్బంగా గుర్తు చేశారు. బంగ్లాదేశ్‌లో ఈ అశాంతిని పాకిస్థానే రాజేసిందని మండిపడ్డారు. 1971 యుద్దాని దృష్టిలో పెట్టుకుని పాక్ ఈ విధంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబద్దతను చాటుకున్న భారత్...
బంగ్లాదేశ్‌లో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో పొరుగు దేశం భారత్ స్పందించిన తీరుపై సామాజిక కార్యకర్త అమిర్ ఖురేషి ప్రశంసలు వర్షం కురిపించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా, అవసరమైన వారికి నిజమైన అభయహస్తం అందిస్తామనే విధంగా భారత్ తన నిబద్ధతను మరోసారి ప్రదర్శించిందని స్పష్టం చేశారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 08 , 2024 | 10:20 AM