ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Salman Khan house firing: మూడుసార్లు రెక్కీ, ఐదు రౌండ్ల కాల్పులు

ABN, Publish Date - Apr 16 , 2024 | 03:40 PM

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టయిన ఇద్దరు నిందితులను ఈనెల 25 వరకూ పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని ముంబై కోర్టు మంగళవారంనాడు ఆదేశించింది. కాల్పుల ఘటన వెనుక కుట్ర వివరాలు, ప్రధాన సూత్రధారి ఎవరనేది తెలుసుకునేందుకు నిందితులను 14రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును క్రైం బ్రాంచ్ కోరింది.

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టయిన ఇద్దరు నిందితులను ఈనెల 25 వరకూ పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని ముంబై కోర్టు మంగళవారంనాడు ఆదేశించింది. కాల్పుల ఘటన వెనుక కుట్ర వివరాలు, ప్రధాన సూత్రధారి ఎవరనేది తెలుసుకునేందుకు నిందితులను 14రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును క్రైం బ్రాంచ్ కోరింది. అయితే కోర్టు ఏప్రిల్ 25 వరకూ 9 రోజుల కస్టడీకి అనుమతించింది.

సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులకు అమెరికాలో కుట్ర


కాగా, ఈ కేసులో విక్కీ గుప్తా, సార్ సాగ్ అనే ఇద్దరు నిందితులను గుజరాత్‌లో అరెస్టు చేశామని, ఈ ఇద్దరూ సల్మాన్ ఇంటి వద్ద మూడుసార్లు రెక్కీ నిర్వహించి, ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ లక్ష్మీ గౌతం మీడియోతో మాట్లాడుతూ చెప్పారు. ఆదివారం ఉదయం సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ 921) ఆ వెంటనే పరారయ్యారని, వారిని గుజరాత్‌లోని కచ్ జిల్లా మాతా నో మాథ్ గ్రామంలో సోమవారం రాత్రి అరెస్టు చేశామని చెప్పారు. వారిని ముంబై తరలించి మంగళవారంనాడు మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచినట్టు వివరించారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర టెక్నాలజీ సాయంతో నిందితులిద్దరి ఆచూకీ తెలుసుకున్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 03:40 PM

Advertising
Advertising