ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మా పరాజయానికి మాజీ సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ కారణం

ABN, Publish Date - Nov 25 , 2024 | 03:20 AM

మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ పరాజయానికి మాజీ సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ కారణమని శివసేన(యూబీటీ) నేత సంజయ్‌రౌత్‌ ఆరోపించారు.

ముంబై, నవంబరు24: మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ పరాజయానికి మాజీ సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ కారణమని శివసేన(యూబీటీ) నేత సంజయ్‌రౌత్‌ ఆరోపించారు. 2022లో తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్‌లపై జస్టిస్‌ చంద్రచూడ్‌ వెంటనే నిర్ణయించలేదని రౌత్‌ ఆరోపించారు. దీనివల్ల పార్టీ ఫిరాయింపుదారుల్లో చట్టం అంటే భయం లేకుండా పోయిందన్నారు. చంద్రచూడ్‌ పేరు చరిత్రలో నల్ల అక్షరాలతో లిఖిస్తారని రౌత్‌ చెప్పారు. 2022లో శివసేనలో తిరుగుబాటు జరిగి ఏక్‌నాథ్‌ శిండే సారథ్యంలో మెజార్టీ ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టారు. బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారం చేపట్టారు. శిండే సీఎం కూడా అయ్యారు. శిండేదే అసలైన శివసేన అని ఈసీ కూడా ప్రకటించింది.

Updated Date - Nov 25 , 2024 | 03:21 AM