ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Satyendra Jain: సత్యమేవ జయతే.. జైలు నుంచి విడుదల కాగానే తొలి రియాక్షన్

ABN, Publish Date - Oct 18 , 2024 | 09:03 PM

మనీ లాండరింగ్ కేసులో బెయిలు మంజూరు కావడంతో ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ముఖ్యమంత్రి అతిషి, ఆప్ కీలక నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తదితరులు జైలు బయట సత్యేంద్ర జైన్‌కు సాదర స్వాగతం పలికారు.

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో బెయిలు మంజూరు కావడంతో ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Jain) శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ముఖ్యమంత్రి అతిషి, ఆప్ కీలక నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తదితరులు జైలు బయట సత్యేంద్ర జైన్‌కు సాదర స్వాగతం పలికారు. బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయంపై సత్యేంద్ర జైన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది సత్యానికి దక్కిన విజయమని అభివర్ణిస్తూ 'సత్యమేవ జయతే' అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

Satyendra Jain: మనీ లాండరింగ్‌ కేసులో సత్యేంద్ర జైన్‌కు బెయిల్


మొహల్లా క్లినిక్, ఉచిత మందులు, పలు ఆరోగ్య పథకాలతో ఢిల్లీ మోడల్‌ను తీర్చిదిద్దడంలో సత్యేంద్ర జైన్ కృషి శ్లాఘనీయమని సంజయ్ సింగ్ అన్నారు. ఆప్ కార్యకర్తలు, నేతలకు ఇది పెద్దవార్త అని, 873 రోజులులో జైలులోనే ఉండి, 36 కిలోల బరువు తగ్గిపోయారని, ఆయినప్పటికీ ఆయనలో చెక్కుచెదరని స్ఫూర్తికి తాను సెల్యూట్ చేస్తు్న్నానని చెప్పారు. సత్యేంద్ర జైన్‌, అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ తప్పుడు అభియోగాలు మోపి ఈడీతో జైలుకు పంపించిందని మనీష్ సిసోడియా ఆరోపించారు. దీంతో ఢిల్లీ ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, తమ నేతలు ఒక్క రూపాయి పోగుచేసుకున్నట్టు కూడా నిరూపించలేక పోయారని, ఇప్పటికైనా ప్రధాని, బీజేపీ ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సత్యేంద్ర జైన్‌కు బెయిలుతో ఆప్‌కు మరింత బలం చేకూరిందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఢిల్లీ ఎన్నికలకు ఆప్ సర్వసన్నద్ధంగా ఉందని ఆప్ మరో నేత సౌరభ భరద్వాజ్ ధీమా వ్యక్తం చేశారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..

Updated Date - Oct 18 , 2024 | 09:05 PM