ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Haryana Election: హర్యానా ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా రూ.2.4 లక్షల కోట్ల సంపన్నురాలు

ABN, Publish Date - Sep 13 , 2024 | 08:12 AM

ఎన్నికల్లో సంపన్న వ్యక్తులు పోటీ చేయడం సాధారణమే. అయితే హర్యానా ఎన్నికల్లో మాత్రం రికార్డు స్థాయి ఆస్తి ఉన్న ఒక మహిళ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ఆమె ఎవరో కాదు బీజేపీ కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కొంతకాలంగా ఎదురుచూసిన ఆమె బీజేపీ టికెట్ ఆశించారు.

ఎన్నికల్లో సంపన్న వ్యక్తులు పోటీ చేయడం సాధారణమే. అయితే హర్యానా ఎన్నికల్లో మాత్రం రికార్డు స్థాయి ఆస్తి ఉన్న ఒక మహిళ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె ఎవరో కాదు బీజేపీ కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని ఆమె ఆశించారు. అయితే కాషాయ పార్టీ జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. హిస్సార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు చివరి రోజు అయిన గురువారం ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.


భారత ప్రముఖ పారిశ్రామివేత్త, దివంగత ఓపీ జిందాల్ సతీమణి అయిన సావిత్రి జిందాల్‌.. హిస్సార్ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తాపై పోటీకి దిగారు. ఆయనతోనే ఆమెకు ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. హిస్సార్ నియోజకవర్గ అభివృద్ధి, మార్పు కోసం తాను సేవ చేస్తానని ఆమె అన్నారు. ‘‘హిస్సార్ ప్రజలు నా కుటుంబ సభ్యులు. నా భర్త, దివంగత ఓం ప్రకాశ్ జిందాల్ మీతో నా బంధాన్ని ఏర్పరచారు. జిందాల్ కుటుంబం ఎల్లప్పుడూ హిస్సార్‌కు సేవ చేస్తూనే ఉంది. చేస్తూనే ఉంటుంది. ప్రజల అంచనాలకు అనుగుణంగా, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సంపూర్ణ అంకితభావంతో ఉంటాను’’ అని సావిత్రి జిందాల్ హామీ ఇచ్చారు.


‘హిస్సార్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ కమల్ గుప్తాను బరిలోకి దింపింది. సొంత పార్టీ అభ్యర్థిపై పోటీ చేయడం తిరుగుబాటు కాదా’ అని విలేకరులు ప్రశ్నించగా సావిత్రి జిందాల్‌ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘అలా పరిగణించకూడదు. నా కొడుకు నవీన్ జిందాల్ తరపున లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం మాత్రమే చేశాను. నేను పార్టీ సభ్యత్వం తీసుకోలేదు’’ అని ఆమె వివరణ ఇచ్చారు.


కాగా హిస్సార్ అసెంబ్లీ స్థానం నుంచి సావిత్రి జిందాల్ పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2005లో తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా రెండోసారి 2009లో కూడా ఈ సీటును ఆమె కైవసం చేసుకున్నారు. 2013లో మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ ఏడాది మార్చిలోనే కొడుకు నవీన్ జిందాల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో ఆయన బాటలోనే సావిత్రి జిందాల్ కూడా కాంగ్రెస్‌ను వీడారు.


కాగా ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సావిత్రి జిందాల్ నికర సంపద 29.1 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.2.4 లక్షల కోట్లతో సమానం. దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ అని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. కాగా హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Updated Date - Sep 13 , 2024 | 08:23 AM

Advertising
Advertising