Students clash: విద్యార్థుల ఘర్షణతో ఉదయ్‌పూర్‌లో సెక్షన్ 144
ABN, Publish Date - Aug 16 , 2024 | 07:40 PM
విద్యార్థుల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో 144 సెక్షన్ విధించారు. ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక విద్యార్థి గాయపడగా అతన్ని ఎంబీ ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం తెలిసిన వెంటనే హిందూ సంస్థకు చెందిన కొందరు ఆసుపత్రి వద్ద ప్రదర్శనకు దిగారు.
జైపూర్: విద్యార్థుల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాజస్థాన్ (Rajasthan)లోని ఉదయ్‌పూర్‌లో 144 సెక్షన్ విధించారు. ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక విద్యార్థి గాయపడగా అతన్ని ఎంబీ ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం తెలిసిన వెంటనే హిందూ సంస్థకు చెందిన కొందరు ఆసుపత్రి వద్ద ప్రదర్శనకు దిగారు.
Rahul Citizenship: రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి
సంఘటన వివరాల ప్రకారం, సూరజ్‌పోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు స్కూలు విద్యార్థుల మధ్య వాగ్వాదం చివరికి ఘర్షణగా మారింది. ఈ ఘటనలో దేవరాజ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో సూరజ్‌పాల్ పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో పలువురు విద్యార్థులు అక్కడికి చేరుకుని దుకాణాలు మూయించేశారు. దాడికి నిరసనగా నినాదాలు చేయడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వారిని శాంతపరిచే ప్రయత్నాలు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. కాగా, వందతులు నమ్మవద్దని, కత్తిపోట్లకు గురైన విద్యార్థి దేవరాజ్ ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారని జిల్లా కలెక్టర్ అరవింద్ పోస్వాల్ తెలిపారు. దాడికి దిగిన విద్యార్థి, అతని తండ్రిని అరెస్టు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 16 , 2024 | 07:45 PM