LokSabha Election Result: మారనున్న రాజకీయ పరిణామాలు: ఎయిర్‌పోర్ట్ వద్ద 144 సెక్షన్
ABN, Publish Date - Jun 03 , 2024 | 08:45 PM
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 144 సెక్షన్ విధించినట్లు నగర పోలీస్ ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 03: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 144 సెక్షన్ విధించినట్లు నగర పోలీస్ ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో డ్రోనులు ఎగరవేయడం కానీ. లేజర్ బీమ్‌లు ఉపయోగించడం కానీ చేయరాదన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇవి జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వారు స్పష్టం చేశారు.
Also Read: Bengaluru Recorded: బెంగుళూరులో రికార్డు సృష్టించిన ‘వర్షం’
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ క్రమంలో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారనున్నాయి. అంటే కేంద్రంలో ప్రభుత్వం కొలువు తీరనుంది. అందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీఐపీలు, వీవీఐపీలు.. ఢిల్లీకి తరలి రానున్నారు.
Also Read: Nishant Agarwal: పాక్‌కు ‘బ్రహ్మోస్’ లీక్ చేసిన ఇంజినీర్‌కు యావజీవ శిక్ష విధించిన కోర్టు
దీంతో ఢిల్లీ విమానాశ్రయానికి వీవీఐపీల తాకిడి భారీగా పెరగనుంది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. ఇక విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో వివిధ ఫంక్షన్లలో లేజర్ బిమ్‌లు ఉపయోగించకుండా చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. డ్రోన్లు, పారా గ్లైడర్స్, హ్యాంగ్ గ్లైడర్స్ ఉపయోగించి తీవ్రవాదులు దాడి చేసే అవకాశం ఉన్నట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. ఆ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మరోవైపు ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
Also Read: Nitheesha Kandula: యూఎస్‌లో మరో భారతీయ విద్యార్థి అదృశ్యం
Read Latest Telangana News and National News
Updated Date - Jun 03 , 2024 | 08:46 PM