ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kerala: అన్నా సెబాస్టియన్ తల్లిదండ్రులను పరామర్శించిన ఎంపీ శశిథరూర్

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:06 PM

తీవ్ర పని ఒత్తిడితో పుణేలోని యర్నెస్ట్ అండ్ యంగ్‌లో చార్టెడ్ అకౌటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ పరామర్శించారు. అందుకు సంబంధించిన చిత్రాలను ఆయన తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: తీవ్ర పని ఒత్తిడితో పుణేలోని యర్నెస్ట్ అండ్ యంగ్‌లో చార్టెడ్ అకౌటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ పరామర్శించారు. పని ప్రాంతంలో జవాబుదారీతనం, కొత్త చట్టాలు, నిబంధనల గురించి వారితో చర్చించినట్లు తెలిపారు. అలాగే తక్కువ సిబ్బంది ఉన్న సంస్థలు, మధ్య స్థాయి నిర్వాహకులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. వారిని కలిసిన ఫొటోలను ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.

Also Read: Janasena: బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..


పుణేలోని యర్నెస్ట్ అండ్ యంగ్‌ సంస్థలో కేరళకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ సెబాస్టియన్ విధులు నిర్వహిస్తుంది. ఆమె సంస్థలో చేరిన నాలుగు నేలల కాలంలో ఒక్క రోజు కూడా ఆమెకు సెలవు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అధిక పని ఒత్తిడి కారణంగా హార్ట్ అటాక్‌తో అన్నా సెబాస్టియన్ మరణించింది. ఇదే విషయాన్ని యర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఇండియా చైర్మన్ రాజీవ్ మిమాణికి మృతురాలు తల్లి అన్నా అగస్టీన్ లేఖ ద్వారా తెలియజేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఎంపీ శశిథరూర్ స్పందించారు. అనంతరం అన్నా సెబాస్టియన్ తండ్రి సెబీ జోసెఫ్‌తో పోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా అన్నా సెబాస్టియన్ మృతిపై ఎంపీ శశిథరూర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీ శశిథరూర్‌కు సెబీ జోసఫ్ పలు కీలక సూచనలు చేశారు. ఆ సూచనలు ఏమంటే..

Also Read: Gold and Silver Rates Today: చరిత్రలోనే తొలిసారి.. భారీగా పెరిగిన బంగారం ధరలు..


అన్ని పని ప్రదేశాల్లో పని గంటలకు ఓ నిర్ణీత క్యాలెండర్ విధానం ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అన్ని పని ప్రదేశాల్లో రోజుకు 8 గంటలు పని చేసేలా ఓ నియమం తప్పకండా ఉండాలని చెప్పారు. అలా వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలన్నారని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో మానవ హక్కుల సంస్థల జోక్యం తప్పని సరిగా ఉండాలని స్పష్టం చేశారు. అయితే అంశాలన్నీ పార్లమెంట్ సమావేశాల ఆరంభంలోనే తాను చర్చిస్తానని ఈ సందర్భంగా సెబీ జోసఫ్‌కు శశిథరూర్ హామీ ఇచ్చిన విషయం విధితమే.

Also Read: 3D Printed Hotel: ప్రపంచంలోనే తొలి త్రీడి ప్రింటింగ్ హోటల్

For National News And Telugu New...

Updated Date - Sep 26 , 2024 | 12:06 PM